Prashanth Neel Birthday | కేజీఎఫ్, సలార్ చిత్రాల ఫేమ్ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా టాలీవుడ్ అగ్ర నటుడు ఎన్టీఆర్ కూడా ప్రశాంత్‌కి బర్త్‌డే విషెస్ తెలిపాడు. హ్యాపీ బర్త్‌డే ప్రశాంత్ నీల్. మీ విజన్ మాటల కంటే గొప్పది. తెరపై మరింత ఫైర్‌ని చూడాలని ఆశిస్తున్నాను అని తారక్ రాసుకోచ్చాడు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ నీల్ అంటూ రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కి డ్రాగన్ అనే టైటిల్‌ని అనుకుంటున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ప్రశాంత్ నీల్ గత చిత్రాలు ‘కేజీఎఫ్’ సిరీస్, ‘సలార్’ భారీ విజయాలు సాధించడంతో డ్రాగన్ కూడా అదే స్థాయిలో ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.
Read More