Allu Ayan | 17 ఏళ్లుగా ట్రోఫీ కోసం పరితపిస్తూ వచ్చిన ఆర్సీబీ జట్టు ఎట్టకేలకి తాజా సీజన్లో కప్ ఎగరేసుకుపోయింది. 18వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఐపీఎల్ విజేతగా అవతరించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 18 సంవత్సరాల సుదీర్ఘం ప్రయాణం తర్వాత ఆర్సీబీ జట్టు చివరకు ఆ కలని సాకారం చేసుకుంది. మొదటి ఐపీఎల్ టైటిల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్-2025 ఫైనల్లో.. ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించి చరిత్రను తిరగరాసింది.
తొలిసారి కప్ సాధించడంతో ఆర్సీబీ ఆటగాళ్ల ఆనందం అంతా ఇంతా కాదు. బెంగళూరులోని విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఆర్సీబీ విజయ యాత్రను చేపట్టనున్నారు. ఇవాళ(బుధవారం) మధ్యాహ్నం 3.30 గంటలకు ఆర్సీబీ విక్టరీ పరేడ్ ప్రారంభం కానుందని ఫ్రాంచైజీ సోషల్ మీడియాలోతెలియజేసింది. తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న తర్వాత ఆర్సీబీ తన అభిమానులతో విజయోత్సవాలను జరుపుకోవాలని భావిస్తోంది. ఇక ఈ విజయం తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అయాన్ కూడా ఫుల్ హ్యాపీగా ఫీలయ్యాడు.
అయాన్… విరాట్ కోహ్లీకి వీరాభిమాని. ఆర్సీబీ విజయం సాధించడంతో బన్నీ తనయుడు ఎమోషనల్ అయ్యాడు. తలపై బాటిల్ నీళ్లు కుమ్మరించుకుని భిన్నంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఆ వీడియోను అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకోగా, ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మరో వైపు ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్… బెంగళూరు విజయం సాధించిన వెంటనే ఆనందంతో ఎగిరి గంతేశారు. ఆయన సెలబ్రేషన్స్ తాలూకు వీడియోను అర్ధాంగి లికితారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. “ఈ సాలా కప్ నమ్దు. 18 ఏళ్ల కల నెరవేరింది. క్రేజియెస్ట్ క్రికెట్ ఫ్యాన్ ప్రశాంత్ నీల్‌కు ఇది పర్ఫెక్ట్ గిఫ్ట్” అంటూ ఆమె రాసుకొచ్చారు.