Samantha | ఇండియాలో ఉన్న టాప్ సెలబ్రిటీల్లో ఒకరిగా నిలిచింది సమంత (Samantha). ఈ భామ ప్రస్తుతం హిందీ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టింది. తెలుగులో ఒక ప్రాజెక్ట్ లైన్లో పెట్టిన సామ్ ఇప్పటివరకు స్టార్ యాక్టర్‌తో సినిమా మాత్రం ప్రకటించలేదు. సామ్ ప్రస్తుతం ఆదిత్యారాయ్ కపూర్ లీడ్ రోల్లో నటిస్తోన్న రక్త్ బ్రహ్మాండ్ చేస్తోంది.
సమంత నటించిన తాజా హిందీ వెబ్‌సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’ (Citadel Honey Bunny). ఈ నెల 8 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసింది. పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమాలను ఎందుకు చేయడం లేదని ఆస్ మీ ఎనీథింగ్ సెషన్లో ఓ అభిమాని సమంతను ప్రశ్నించాడు.
దీనికి సామ్ స్పందిస్తూ.. తాను ఇక రొటీన్, రెగ్యులర్ డ్యాన్స్ కమర్షియల్ సినిమాలను చేయనని చెప్పింఇ. అంతేకాదు తాను ప్రస్తుతం ఎక్కువగా నటనకు ఆస్కారమున్న సరైన స్క్రిప్టులను ఎంపిక చేసుకునే దశలో ఉన్నానని చెప్పుకొచ్చింది. సో ఇకపై సమంత నుంచి రెగ్యులర్ సినిమాలు కాకుండా.. కొత్తదనంతో కూడిన పర్ఫార్మెన్స్ ఓరియెంట్ సినిమాలకే సామ్ చేయబోతుందన్నమాట.
రాజ్-డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టులో కేకే మీనన్, సిమ్రన్, సోహం మజుందార్, శివంకిత్ పరిహార్, కశ్వీ మజుందార్, సాఖిబ్ సలీం, సికిందర్ ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సిటడెల్ను రాజ్& డీకే D2R Films బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు రాజ్&డీకే, సీతా మీనన్ కథనందించారు.
Thandel | నాగచైతన్య, సాయి పల్లవి ఎమోషనల్ స్టిల్.. థియేటర్లలో తండేల్ సునామి వచ్చే తేదీ ఇదే..!
Devara | దేవర వచ్చేస్తున్నాడు.. ఓటీటీ ప్లాట్‌ఫాంలో తారక్ మూవీ స్ట్రీమింగ్ టైం ఫిక్స్
Thalapathy 69 | బాక్సాఫీస్‌ను రూల్ చేయబోతున్న విజయ్-హెచ్ వినోథ్.. దళపతి 69 రైట్స్‌కు రికార్డ్ ధర