టాలీవుడ్ (Telugu cinema) భామల్లో చాలా ప్రొఫెషనల్‌గా ఉండేవాళ్లు కొంతమందే ఉన్నారు. ఈ జాబితాలో టాప్ ప్లేస్ లో ఉంటుంది సమంత (Samantha). నాగచైతన్యతో పెళ్లి,విడాకులు లాంటి అంశాలు కొంతకాలం హాట్ టాపిక్‌గా మారినా..ఇవేమీ సమంత క్రేజ్‌ను ఇసుమంత కూడా తగ్గించలేదు. స్టార్ హీరోయిన్ గా లీడింగ్ పొజిషన్లో ఉన్న సామ్‌కు అదనపు ఆదాయం కోసం తన మార్కెట్‌ను ఎలా విస్తరించుకోవాలో బాగా తెలుసు. సోషల్ మీడియాలో సమంత ఫాలోవర్ల సంఖ్య భారీగానే ఉన్న సంగతి తెలిసిందే.
రోజురోజుకీ ఫాలోవర్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. తన క్రేజ్‌ను ఉపయోగించుకుంటూ సోషల్ మీడియా ఖాతాల ద్వారా మరింత ఆదాయాన్ని ఆర్జిస్తుందన్న న్యూస్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇన్ స్టాగ్రామ్ లో సమంత ఒక సింగిల్ పోస్టు (Instagram single post)కు రూ.8 లక్షలు ఛార్జ్ చేస్తుందట. అయితే ఈ పే చెక్‌ను ఇపుడు ఏకంగా రూ.20 లక్షలకు పెంచేసిందని ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇన్ స్టా ఖాతాలో కమర్షియల్ యాడ్‌ను పోస్ట్ చేయాలంటే రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్న లేటెస్ట్ టాక్.
సమంత ప్రస్తుతం సినిమాల కంటే ఎక్కువగా బ్రాండ్స్, సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యుయెన్సర్ వర్క్ (social media influencer work ) ద్వారానే అధికంగా ఆదాయం ఆర్జిస్తుందట. మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఏమాత్రం కూడా తగ్గేదేలే అంటూ తన సవర్ ఏంటో చూపిస్తోంది సామ్. ఈ భామ ప్రస్తుతం యశోద సినిమాలో నటిస్తోంది.