టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) దర్శకత్వంలో చేస్తున్న చిత్రం కాతువాకుల రెండు కాధల్. రొమాంటిక్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ను మేకర్స్ అందరితో పంచుకున్నారు. ఈ చిత్రంలో సామ్ పాత్రను ప్రకటించారు మేకర్స్. సమంత ఇందులో ఖతిజా (Khatija) పాత్రలో కనిపించనుంది. అంతేకాదు ఈ ప్రాజెక్టులో విజయ్ సేతుపతి పాత్ర పేరు రాంబో అని డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ప్రకటించాడు.
అందమైన సమంతను మా సినిమాలో ఖతిజాగా చూపించబోతుండటం చాలా సంతోషంగా ఉందని విఘ్నేశ్ శివన్ అన్నాడు. తన ఫస్ట్‌లుక్ క్యారెక్టర్ పోస్టర్‌ను సామ్ ట్వీట్ చేస్తూ..ఈ సినిమాను చూసేందుకు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నానని చెప్పింది. డిసెంబర్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని విఘ్నేశ్ శివన్ తెలిపాడు. విజయ్ సేతుపతి, నయనతరా, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ.
#RAMBO 🧑🦱😎 @VijaySethuOffl
— Anirudh Ravichander (@anirudhofficial) November 15, 2021
& #Khatija 😎 @Samanthaprabhu2 from #KaathuVaakulaRenduKaadhal @VijaySethuOffl @VigneshShivN #Nayanthara @7screenstudio @sreekar_prasad @srkathiir @KVijayKartik @Rowdy_Pictures @SonyMusicSouth #KRK #KRKFL #KRKFirstLooks pic.twitter.com/G64Mnl3HRk
నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సామ్ కొత్త చిత్రంలో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నదని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ విఘ్నేశ్ శివన్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Upasana: పిల్లల గురించి ఉపాసనకు ప్రశ్న.. సమాధానం ఏంటంటే..!
Upasana Surprise| ఉక్రెయిన్ లో ఉపాసన సర్ప్రైజ్..పోస్ట్ వైరల్
Nayantara or Samantha | సమంత, నయనతారలో ఇంతకీ ఎవరు ఆ ఛాన్స్ కొట్టేసేది..?
Sai Pallavi New Skill | కొత్త టాలెంట్ చూపిస్తానంటున్న సాయిపల్లవి