ఇండియాలో కపూర్ కుటుంబం తర్వాత కేవలం అల్లు కుటుంబంలో మాత్రమే నాలుగు జనరేషన్స్ నటులు ఉన్నారు. చాలా చిన్న వయసులోనే అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ సినిమాల్లోకి వచ్చేస్తుంది. సమంత అక్కినేని ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమాలో బాల భరతుడి పాత్రలో అల్లు అర్హ నటిస్తోంది. అల్లు కుటుంబం నుంచి అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్, అల్లు అర్జున్ తర్వాత నాలుగో తరం అర్హ. ఈమె ఎంట్రీతో అల్లు వారి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ఈ మధ్యే శాకుంతలం సినిమా షూటింగ్లో అడుగు పెట్టింది అల్లు అర్హ. ప్రస్తుతం ఈ చిన్నారితో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు గుణశేఖర్. ఈ మైథలాజికల్ లవ్ డ్రామాలో సమంత అక్కినేనితో పాటు దేవ్ మోహన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. శాకుంతలం షూటింగ్ లో అడుగు పెట్టగానే అల్లు అర్హకు సమంత రూపంలో ఒక పెద్ద అభిమాని దొరికారు. అల్లు అర్హ నటన గురించి ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో షేర్ చేసుకుంది సమంత అక్కినేని. తన డైలాగ్స్ అన్నీ కేవలం ఒకే టేక్‌లో పూర్తి చేసింది.. ఫస్ట్ టేక్ లోనే అద్భుతమైన డైలాగ్స్ తో ఆకట్టుకుంది. ఫ్యూచర్లో మనకు ఒక సూపర్ స్టార్ వచ్చేసింది.. గాడ్ బ్లెస్ అంటూ అల్లు అర్హ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సమంత అక్కినేని.
అల్లు శిరీష్ కూడా అల్లు అర్హ ఎంట్రీ గురించి సోషల్ మీడియాలో అభిమానులతో తన అభిప్రాయాలు పంచుకున్నారు. అర్హ కచ్చితంగా తమ అందరినీ గర్వపడే స్థాయికి తీసుకెళ్తుందని నమ్మకంగా చెప్పారు శిరీష్. శాకుంతలం సినిమాలో భరతుడి పాత్రలో నటిస్తున్న చిన్నారి అర్హకు ఆల్ ద బెస్ట్ చెప్పారు ముద్దుల బాబాయ్.
అల్లు అర్హకు ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అంజలి టైటిల్ సాంగ్ తో ఈ చిన్నారికి మంచి క్రేజ్ వచ్చింది. ఈ పాటకు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో 15 మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయి. అంజలి టైటిల్ సాంగ్ లో అద్భుతమైన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ అందరినీ తన చూపులతో కట్టి పడేసింది అల్లు అర్హ. ఇప్పుడు చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చేస్తుంది. ఫ్యూచర్ లో అర్హ సూపర్ స్టార్ స్థాయికి వెళ్లడం కన్ఫర్మ్ అని అందరూ దీవిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
తెలుగు ఇండస్ట్రీకి మరో తమిళ హీరో.. 20 కోట్ల రెమ్యునరేషన్
Tollywood : అందరి దృష్టి టాలీవుడ్‌పైనే.. ఒక ఛాన్స్ అంటున్న ఇతర భాషల హీరోలు
థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‌లో రాశీఖన్నా..?
Bigg boss | బిగ్ బాస్ అప్డేట్.. కంటెస్టెంట్స్ వీళ్ళేనా ?
ఒకే ఒక్కడు రేంజ్లో చరణ్-శంకర్ మూవీ..!
ప్రకాశ్ రాజ్‌కు విజన్ ఉంది,అందుకే సపోర్ట్ చేస్తున్నాను: నాగబాబు