Salim Khan | బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan)కు వరుస హత్య బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ (Baba Siddique) హత్య తర్వాత ఈ బెదిరింపులు మరింత తీవ్రతరమయ్యాయి. చంపేస్తామంటూ సల్మాన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు వరుసగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయితే, సల్మాన్ ఫ్యామిలీ మాత్రం ఈ బెదిరింపులను లెక్కచేయట్లేదు. ఎన్ని బెదిరింపులు వచ్చినా తమతమ పనుల్లో బిజీగా ముందుకు వెళ్తున్నారు.
ఈ క్రమంలోనే సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ (Salim Khan) తాజాగా ఖరీదైన లగ్జరీ కారు (luxury car) కొనుగోలు చేసినట్లు తెలిసింది. జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ (Mercedes-Benz)కు చెందిన బ్రాండ్ న్యూ వైట్ కలర్ కారును కొనుగోలు చేశారు. దీని ధర రూ.1.57 కోట్లు అని టాక్. ఈ కారుకు ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ కారులో సలీమ్ ఖాన్ బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్మెంట్ (Galaxy Apartment) వద్ద మీడియాకు చిక్కారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా, సల్మాన్ ఖాన్‌కు ఇటీవలే వరుస హత్య బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ప్రాణాలతో ఉండాలన్నా, బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సప్ నంబర్‌కు అక్టోబర్ 17 రాత్రి మెసేజ్ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ నంబర్ ఎవరిది, మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందని కనుక్కొనే పనిలో పడ్డారు. ఈ కేసులో జంషెడ్‌పూర్‌కు 24 ఏళ్ల కూరగాయల అమ్మకందారుడు షేక్ హుస్సేన్ షేక్ మౌసిన్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గత శుక్రవారం కూడా సల్మాన్‌కు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. బెదిరింపులకు పాల్పడింది నోయిడాకు చెందిన 20 ఏళ్ల వ్యక్తి మహ్మద్ తయ్యబ్‌గా గుర్తించిన పోలీసులు అతడి అరెస్ట్ చేశారు.
ఇక బుధవారం (ఈరోజు) ఉదయం కూడా సల్మాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. రూ. రెండు కోట్లు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని ఆయన్ను బెదిరించారు. గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఆ మెసేజ్ వచ్చింది. ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఆ మెసేజ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ డబ్బులు చెల్లించకుంటే, అతన్ని చంపేస్తామని ఆ మెసేజ్‌లో వార్నింగ్ ఇచ్చారు. ముంబైలోని వర్లీ పోలీసులు.. గుర్తు తెలియని వ్యక్తిపై కేసు బుక్ చేసి విచారణ చేపట్టారు. వరుస బెదిరింపుల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్‌కు భద్రతను పెంచింది.
Also Read..
Mobile Stolen | భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి ఫోన్ చోరీ.. నలుగురు అరెస్ట్
Eric Garcetti | దివాళీ వేడుకల్లో హిందీ హిట్ పాటకు డ్యాన్స్ చేసిన యూఎస్ దౌత్యవేత్త.. VIDEO