Mobile Stolen | భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి (French Ambassador) థియెర్రీ మథవ్ (Thierry Mathou)కు షాకింగ్ అనుభవం ఎదురైంది. కుటుంబంతో దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రముఖ ప్రాంతంలో షాపింగ్‌కు వెళ్లిన సమయంలో ఆయన ఫోన్ చోరీకి గురైంది (Mobile Stolen). పాకెట్లో ఉన్న థియెర్రీ ఫోన్‌ను కొందరు వ్యక్తులు దొంగిలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 20న థియెర్రీ తన భార్యతో కలిసి ఢిల్లీలోని ఫేమస్ చాందినీ చౌక్ (Chandni Chowk) ఏరియాలో షాపింగ్‌కు వెళ్లారు. అక్కడ జైన్ మందిరం సమీపంలో ఆయన జేబులో ఉన్న మొబైల్ ఫోన్‌ను ఎవరో దొంగిలించారు. ఈ ఘటనపై థియెర్రీ ఆన్లైన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మరుసటి రోజున అంటే అక్టోబర్ 21న ఫ్రాన్స్ రాయబార కార్యాలయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చాందినీ చౌక్ ప్రాంతంలో నిందితుల కోసం జల్లెడ పట్టారు.
ఫోన్ దొంగతనం చేసింది నలుగురు వ్యక్తులని గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి ఫోన్‌ను రికవరీ చేశారు. నిందితులైన నలుగురి వయస్సు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు వెల్లడించారు. వీరంతా యమునా నది ఒడ్డున ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతాల్లో ఒకటైన చాందినీ చౌక్‌లో ఓ దేశ రాయబారి ఫోన్ చోరీకి గురి కావడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
Also Read..
Water Shortage | కాలుష్య కోరల్లో యమునా నది.. ఢిల్లీలో నీటి కొరత