Eric Garcetti | దివాళీ వేడుకల్లో హిందీ హిట్ పాటకు డ్యాన్స్ చేసిన యూఎస్ దౌత్యవేత్త.. VIDEO
Eric Garcetti | భారత్‌లో అమెరికా రాయబారిగా ఉన్న ఎరిక్ గార్సెట్టి (US Envoy Eric Garcetti) మరోసారి తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. దీపావళి వేడుకల్లో భాగంగా గార్సెట్టి స్టేజ్‌పై బాలీవుడ్ హిట్ పాటకు ఎంతో ఉత్సాహంగా కాలు కదిపారు.
Eric Garcetti | భారత్‌లో అమెరికా రాయబారిగా ఉన్న ఎరిక్ గార్సెట్టి (US Envoy Eric Garcetti) మరోసారి తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయంలో బుధవారం దీపావళి వేడుకలను (Diwali Celebrations) ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా గార్సెట్టి స్టేజ్‌పై బాలీవుడ్ హిట్ పాటకు ఎంతో ఉత్సాహంగా కాలు కదిపారు.
విక్కీ కౌశల్ నటించిన ‘బ్యాడ్ న్యూజ్’ (Bad Newz) చిత్రంలోని ‘తౌబా తౌబా..’ (Tauba Tauba) అని సాగే హిట్ పాటకు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. సంప్రదాయ కుర్తా పైజామా ధరించి, కళ్లజోడు పెట్టుకుని గార్సెట్టి చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. గార్సెట్టి ఇలా తన డ్యాన్స్ స్కిల్స్‌తో ఆకట్టుకోవడం ఇదేమీ మొదటి సారి కాదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇలా తన నృత్య ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నారు.
#WATCH | US Ambassador to India, Eric Garcetti dances to the tune of the popular Hindi song ‘Tauba, Tauba’ during Diwali celebrations at the embassy in Delhi
(Video source: US Embassy) pic.twitter.com/MLdLd8IDrH
— ANI (@ANI) October 30, 2024
గతేడాది దీపావళి వేడుకల్లో కూడా గార్సెట్టి తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. షారుక్‌ఖాన్ నటించిన ‘దిల్ సే’ చిత్రంలోని ‘ఛయ్య.. ఛయ్యా..’ పాటకు స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. అంతేకాదు గతేడాది ఢిల్లీలోని సీఆర్ పార్క్‌లో ఏర్పాటు చేసిన దుర్గా పూజలో పాల్గొన్న గార్సెట్టి సంప్రదాయ ‘ధనుచి’ నృత్యంతో ఆకట్టుకున్నారు.
Also Read..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

