Saif Ali Khan | బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)పై దాడి ఘటన నేపథ్యంలో మీడియాకు సైఫ్ భార్య, స్టార్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) కీలక విజ్ఞప్తి చేశారు. తమ పిల్లల ఫొటోలు, వీడియోలు తీయొద్దంటూ ఫొటో గ్రాఫర్లను కోరారు. కరీనా కపూర్ పీఆర్ టీమ్ మంగళవారం ముంబైలో ఫొటోగ్రాఫర్లతో సమావేశమయ్యారు.
సైఫ్ – కరీనా కపూర్ పిల్లలు తైమూర్ అలీ ఖాన్ (Taimur Ali Khan), జహంగీర్ (జెహ్) అలీ ఖాన్ (Jehangir (Jeh) Ali Khan)ల ఫొటోలను తీయొద్దని కోరారు. స్కూల్‌కు వెళ్తున్న సమయంలో, బర్త్‌డే వేడుకల్లో, క్రీడా కేంద్రాల్లో ఇలా ఎక్కడ కనిపించినా వారి ఫొటోలు తీయొద్దని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా కరీనా, సైఫ్ అలీ ఖాన్ ఫొటోల కోసం కూడా వారి ఇంటి ముందు గుమిగూడొద్దని కోరింది. ఏదైనా మూవీ ఫంక్షన్లలో వారి ఫొటోలను తీసుకోవచ్చని పీఆర్ టీమ్ సూచించింది.
సైఫ్ అలీఖాన్‌పై ఈ నెల 16న దాడిన జరిగిన విషయం తెలిసిందే. బాంద్రాలోని నటుడి నివాసంలో చోరీకి వచ్చిన దుండగుడు సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నటుడిని కుటుంబ సభ్యులు లీలావతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ వైద్యులు సైఫ్‌కు శస్త్ర చికిత్స చేశారు. ఇటీవలే డిశ్చార్జ్ అయిన సైఫ్.. ప్రస్తుతం కోలుకుంటున్నారు. మరోవైపు ఈ దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Also Read..
“Saif Ali Khan | సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసు.. నటుడి బ్లడ్ శాంపిల్స్‌ను సేకరించిన పోలీసులు”
“Saif Ali Khan | సైఫ్ అలీ ఖాన్‌పై దాడిలో కరీనా పాత్ర.. కూపీ లాగుతున్న పోలీసులు!”