Saif Ali Khan | బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)పై దాడి కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే నటుడి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు.. తాజాగా సైఫ్ బ్లడ్ శాంపిల్స్ (blood samples)ను సేకరించారు. ఘటన సమయంలో ఆయన ధరించిన దుస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, నేరం జరిగిన రోజు నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహబాద్ ధరించిన దుస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. 16వ తేదీ జరిగిన ఘటనలో నిందితుడి దుస్తులపై రక్తపు మరకలు ఉన్నాయని, అవి సైఫ్వేనా కాదా అని తెలుసుకునేందుకు పోలీసులు శాంపిల్స్‌ను కలెక్ట్ చేశారు. సైఫ్ దుస్తులు, రక్త నమూనాలతోపాటు నిందితుడి దుస్తులను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించారు.
ఇక దాడి కేసును పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. సైఫ్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన భార్య కరీనా కపూర్ పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై కరీనా కపూర్ చెప్పిన వివరాలకు, ఘటన తీరుకు పొంతన కుదరలేదని తెలుస్తున్నది. సైఫ్ పై దాడి జరిగిన సమయంలో కరీనా ఇంట్లోనే ఉంది. ఇంట్లోకి ఒక వ్యక్తి ప్రవేశించాడని, పనిమనిషిపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో అతన్ని ప్రతిఘటించే క్రమంలో సైఫ్‌పై దాడి జరిగిందని కరీనా చెప్తూ వచ్చారు. దుండగుడిని గదిలో బంధించామని, తర్వాత అతడు తప్పించుకుపోయాడని పోలీసులకు చెప్పారు.
అయితే, పోలీసులు సీన్ రీ క్రియేట్ చేయగా.. ఘటన తీరుకు, సైఫ్ ఇంట్లో వాళ్లు చెప్తున్న సమాచారానికి పొంతన లేదని తెలుస్తున్నది. కరీనా, పని మనిషిని వేర్వేరుగా విచారించి, తర్వాత ఇద్దరిని కలిపి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. అత్యంత భద్రతతో కూడిన అపార్ట్మెంట్లోకి కుటుంబ సభ్యులు లేదా పనివారి సాయం లేకుండా కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read..
“Saif Ali Khan | ‘కత్తితో పొడవడంతో విడిచిపెట్టా’.. పోలీసులకు వాంగ్మూలంలో సైఫ్ అలీఖాన్..!”
Saif Ali Khan | సైఫ్ అలీ ఖాన్‌పై దాడిలో కరీనా పాత్ర.. కూపీ లాగుతున్న పోలీసులు!
“Saif Ali Khan | సైఫ్‌కు సాయం చేసిన ఆటో డ్రైవర్‌కు రూ.లక్ష రివార్డు ప్రకటించిన సింగర్”