Saif Attack Case | బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్నది. ఈ కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళను ముంబయి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ముంబయిలో గతంలో అరెస్టు చేసిన బంగ్లాదేశ్ జాతీయుడు ఉపయోగించిన సిమ్ సదరు మహిళ పేరుపై ఉందని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో బెంగాల్‌లోని నదియా జిల్లాలో పోలీసులు సోదాలు నిర్వహించారు.
ఆ తర్వాత సదరు మహిళను అరెస్టు చేశారు. ఆదివారం బెంగాల్‌కు చేరుకున్న పోలీసులు.. సోమవారం అరెస్టు చేశారు. ఖుఖుమోని జహంగీర్ షేక్‌గా మహిళను గుర్తించగా.. భారత్‌లోకి అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీయుడు షరీఫుల్ ఫకీర్తో సంబంధాలు ఉన్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. సైఫ్ అలీఖాన్‌పై ఈ నెల 16న దాడిన జరిగిన విషయం తెలిసిందే. దాంతో ఆయనను కుటుంబీకులు లీలావతి ఆసుపత్రికి తరలించగా.. చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం కోలుకోవడంతో ఆయన ఇంటికి చేరుకున్నారు. సైఫ్ దాడి కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు.
Maha kumbh | మహాకుంభమేళా.. 14 కోట్ల మంది పుణ్యస్నానాలు