Saidharam tej republic movie | హీరో సాయి ధరమ్ తేజ్ మెల్లమెల్లగా కోలుకుంటున్నాడు. యాక్సిడెంట్ తర్వాత ఈ మధ్య మళ్లీ బయటకు రావడం మొదలు పెట్టాడు సాయి ధరమ్ తేజ్. మొన్నామధ్య దీపావళి పండుగ రోజు కుటుంబ సభ్యులతో పండుగ సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను మెగా ఫ్యామిలీ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఆ తర్వాత కొద్దిరోజులకు తన రిపబ్లిక్ సినిమా గురించి వాయిస్ మెసేజ్ ఇచ్చాడు తేజూ.
Firstly, Thank you all for the love you're showering for #RepublicOnZee5.
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 26, 2021
This Friday remains very special for me as I have loved playing Panja Abhiram and yearned to watch with you all.
I am watching with team and happy to see you all joining in 🤗#Republic pic.twitter.com/DMgP573tGL
నవంబర్ 26న రిపబ్లిక్ సినిమా ‘జీ 5’ ఓటీటీ వేదికలో విడుదలైంది. దీనికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తన రిపబ్లిక్ సినిమాను ప్రేక్షకులతో కలిసి చూడలేకపోయానని.. అందుకే ఓటీటీ వేదికగా అందరం కలిసి చూద్దాం.. సినిమా చూసిన తర్వాత అభిప్రాయాలు మాకు తెలపండి అంటూ అభిమానులను కోరాడు సాయి ధరమ్ తేజ్.
ముందుగా చెప్పినట్లుగానే ఇప్పుడు దర్శక నిర్మాతలతో కలిసి సినిమా చూశాడు మెగా మేనల్లుడు. చిత్ర దర్శకుడు దేవ కట్టా, స్క్రీన్ ప్లే రైటర్ కిరణ్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ సతీశ్ బీకేఎఆర్, జీ స్టూడియోస్ తెలుగు కంటెంట్ హెడ్ ప్రసాద్ నిమ్మకాయలతో కలిసి సినిమా సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. తన సంతోషాన్ని పంచుకున్నారు. సినిమా విడుదలైన సమయంలో థియేటర్లలో ఆయన చూడలేకపోయారు. అందుకే జీ 5లో చూశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాయి తేజ్ ఇంకా త్వరగా కోలుకోవాలని.. వీలైనంత తొందరగా ఆయన మళ్లీ సినిమా షూటింగ్స్‌తో బిజీ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపాడు సాయి ధరమ్ తేజ్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Tollywood | కొంతమంది హీరోలకు సొంత పేర్లు అసలు కలిసి రావు.. ఇదుగో సాక్ష్యం
chiranjeevi | చిరంజీవికి పేరు లేని సినిమా ఏదో తెలుసా..?
టాలీవుడ్లో మారుతున్న ఈక్వేషన్స్.. మెగా ఇమేజ్ నుంచి బయటపడే ఆలోచనలో అల్లు అర్జున్
kgf – kaikala satyanarayana | కేజీఎఫ్ సినిమాతో కైకాల కు సంబంధమేంటి?
ఆ సినిమా తీసినందుకు ఈవీవీని అంతలా తిట్టారా.. సంచలన విషయాలు బయటపెట్టిన కోట
జంధ్యాల అహ నా పెళ్లంటలో కోట పాత్రకు ముందుగా ఎవర్ని అనుకున్నారో తెలుసా
కన్నీరు పెట్టిస్తున్న ఉదయ్ కిరణ్ చివరి లేఖ.. భార్యతో గొడవలే ఆత్మహత్యకు కారణమా?
ఉదయ్ కిరణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..