సాయిపల్లవి ( Sai Pallavi ) సమయం దొరికినప్పుడల్లా తన కుటుంబంతో గడిపేందుకు రెడీగా ఉంటుంది. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే ఈ భామ అప్పుడప్పుడు తన ఫ్యామిలీ మెంబర్స్ కోసం విలువైన సమయాన్ని కేటాయిస్తుంది. నెట్టింట్లో కూడా ఫొటోలను పోస్ట్ చేస్తుంది. తాజాగా సాయిపల్లవి తన గ్రాండ్ పేరెంట్స్ ( Grand Parents ) తో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి ట్రెండింగ్ అవుతున్నాయి. ఇంతకీ స్పెషల్ ఏంటంటే ఇవాళ సాయిపల్లవి తాత 85వ పుట్టినరోజు.
ఈ సందర్భంగా సాంప్రదాయ వస్త్రధారణ వేసుకుని తాతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. బ్లూ శారీలో ఉన్న సాయిపల్లవి కొప్పులో మల్లెమాల వేసుకుని తాతను హగ్ చేసుకుని చిరునవ్వులు చిందిస్తోంది. ఇక తాత కూడా గారాల మనవరాలిని హత్తుకొని ప్రేమానురాగాలను పంచాడు.
తాత బర్త్ డే పార్టీలో నానమ్మతో కూడా ఫొటోలు దిగింది. సాయిపల్లవితోపాటు సోదరి పూజా కన్నన్ ( Pooja Kannan ) కూడా ట్రెడిషనల్ వేర్ లో మెరిసిపోయింది. ఈ కోలీవుడ్ ముద్దుగుమ్మల ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి మరి.
ఇవి కూడా చదవండి..
Karan Johar Fear| భయపడుతున్న బాలీవుడ్ దర్శకుడు
Sukumar | తండ్రి పేరు మీద స్కూల్ ప్రారంభించిన సుకుమార్
దోస్తి వీడియో సాంగ్ ఐడియా ఎవరిదో చెప్పిన రాజమౌళి
Vedhika Kumar look | వేదిక స్టన్నింగ్ లుక్కు నెటిజన్లు ఫిదా….వీడియో