మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అయిపోతుంది తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి. సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు ముందుకు రావడం లేదు. ఇలాంటి సమయంలో తమ సినిమాలను విడుదల చేస్తామని ప్రకటించిన నిర్మాతలు కూడా వెనక్కి వెళ్లిపోతున్నారు. ఏపీలో ఇప్పటి వరకు 3 షోలకు మాత్రమే అనుమతి ఉండటంతో పెద్ద సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు ముందుకు రావడం లేదు. ఇన్ని ప్రతికూలతల మధ్య ఈ మధ్య ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్ తాను నిర్మించిన లవ్ స్టోరీ సినిమాను సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదల చేస్తానని ప్రకటించాడు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. చాలా రోజుల తర్వాత ఒక పెద్ద సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధం కావడంతో ఎగ్జిబిటర్లు కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు. కానీ ఇప్పుడు ఈ సినిమా విడుదల విషయంలో సునీల్ నారంగ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఏపీలో రోజుకు నాలుగు షోలకు అనుమతి ఇచ్చినప్పుడే తమ సినిమాను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తాజాగా స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే జగన్ ప్రభుత్వం నాలుగు షోలకు అనుమతి ఇచ్చేలా కనిపించడం లేదు. అంటే లవ్ స్టోరీ సినిమా ఇప్పట్లో ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమే. వినాయక చవితి బరి నుంచి లవ్ స్టోరీ సినిమా తప్పుకోవడంతో ఆ ప్లేస్‌లో మరికొన్ని సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరీ ముఖ్యంగా చిన్న సినిమాలు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాయి. అలాంటి చిన్న సినిమాల నిర్మాతలకు వినాయక చవితిని మించిన బెస్ట్ ఆప్షన్ మరొకటి లేదు. కానీ లవ్ స్టోరీ సినిమా కోసం వేచి చూస్తున్న సాయిపల్లవి, అక్కినేని అభిమానులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూసే. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా గత నాలుగు నెలలుగా వాయిదా పడుతూనే ఉంది. కొత్త రిలీజ్ డేట్ కోసం పరుగులు పెడుతూనే ఉంది. మరి ఈ లవ్‌స్టోరీ సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
శ్రీకాంత్ -ఊహా కూతురు వెండితెరకు పరిచయం కాబోతుందా?
Bigg boss 5 | అప్పుడే బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కు కరోనా.. వార్తలు నిజమేనా..?
పవన్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే వార్త చెప్పిన బండ్ల..ఇక ఆ రోజు సందడే సందడి..!
RRR: అఖిల్ సినిమా రిలీజ్ డేట్‌తో ఆర్ఆర్ఆర్ వాయిదాపై వచ్చిన క్లారిటీ..!
భార్యపై రేప్ నేరం కాదు.. తాప్సీ స్పందన ఏంటంటే..!