Sai Durgha Tej | విరూపాక్ష, బ్రో సినిమాలతో గ్రాండ్ హిట్స్ అందుకున్నాడు సాయి దుర్గ తేజ్ (Sai Durgha Tej). ఈ రెండు సినిమాల తర్వాత చేయబోతున్న కొత్త సినిమా ఎలా ఉండబోతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫాలోవర్లకు ఇటీవలే ఓ అప్డేట్ కూడా అందించాడు. ఈ యంగ్ హీరో నెక్ట్స్ పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు.
డెబ్యూ డైరెక్టర్ రోహిత్ (rohit) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 1940 బ్యాక్‌డ్రాప్ కథాంశంతో రాబోతున్న ఈ చిత్రాన్ని రూ.120 కోట్ల భారీ బడ్జెట్‌తో సాయి దుర్గ తేజ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఇటీవలే హైదరాబాద్‌లో వేసిన సెట్లో షూటింగ్ మొదలైనట్టు వార్త బయటకు వచ్చిందని తెలిసిందే. తాజాగా మరో అప్డేట్ తెరపైకి వచ్చింది.
తాజా టాక్ ప్రకారం తొలి షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. కథకు జీవం పోసేందుకు మేకర్స్ ప్రత్యేకంగా 13 భారీ సెట్స్‌ను నిర్మించారని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు కనిపించబోతున్నారు.. ఇతర నటీనటులు, తదితర వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకా టైటిల్ ఫైనల్ కాని ఈ చిత్రాన్ని 2025 ఆగస్టులో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.
Sara Ali Khan | అనంత్ అంబానీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో సారా అలీఖాన్ మెరుపులు
SSMB 29 | అప్పుడు ప్రభాస్.. ఇప్పుడు మహేశ్ బాబు.. ఎస్ఎస్ఎంబీ 29 క్రేజీ వార్తేంటో తెలుసా..?
Shankar | ఏంటీ ఇండియన్ 2లో కమల్ హాసన్ తక్కువ టైమే కనిపిస్తాడా..? శంకర్ క్లారిటీ
Shankar | మమ్మల్ని నమ్మండి… అంతకంటే ఎక్కువే శ్రమించాం.. డైరెక్టర్ శంకర్ కామెంట్స్ వైరల్