SYG | టాలీవుడ్ యాక్టర్ సాయి దుర్గ తేజ్ నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ సంబరాల యేటి గట్టు (SYG). రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నాడు. సుమారు రూ.125 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్టు టీం ఇప్పటికే ప్రకటించిందని తెలిసిందే. అయితే ఈ చిత్రం వాయిదా పడుతున్నట్టు వార్తలు వస్తుండగా.. వీటిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
ఇటీవల వేతన పెంపుపై సినీ కార్మికుల నిరవధిక సమ్మె, సీజీ వర్క్ పెండింగ్, ఇతర కారణాల వల్ల సినిమా ఆలస్యమవుతుంది. పవర్ ఫుల్ స్టోరీ టెల్లింగ్, అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన హై క్వాలిటీ సినిమాను అందించేందుకు మరింత సమయం తీసుకోనున్నట్టు ప్రకటించారు. త్వరలో కొత్త విడుదల తేదీని కూడా ప్రకటిస్తామన్నారు. ఈ చిత్రంలో సాయి దుర్గ తేజ్ ఇదివరకెన్నడూ కనిపించని అత్యంత పవర్ ఫుల్ రోల్లో కనిపించబోతుండగా.. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడని సమాచారం.
ఎస్వైజీలో ఐశ్వర్య లక్ష్మి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. జగపతిబాబు, శ్రీకాంత్, సాయికుమార్, అనన్య నాగళ్ల, రవి కృష్ణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో విడుదల కానుంది. ఇందులో ఓ బాలీవుడ్ స్టార్ యాక్టర్ విలన్‌గా కనిపించబోతున్నట్టు వార్తలు వస్తుండగా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
AN IMPORTANT ANNOUNCEMENT from team #SYG. #SambaralaYetiGattu #SYGMovie
Mega Supreme Hero @IamSaiDharamTej @rohithkp_dir @AishuL_ @Primeshowtweets @Niran_Reddy @Chaitanyaniran @rkdstudios pic.twitter.com/KecCk2oPQr
— Primeshow Entertainment (@Primeshowtweets) September 20, 2025
Itlu Me Yedhava | ‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసిన బుచ్చిబాబు సానా