బ్యాక్ టు బ్యాక్ సినిమా అప్డేట్స్తో అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు టాలీవుడ్ యువ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej). ఈ యాక్టర్ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి విరూపాక్ష (Virupaksha). SDT15వ చిత్రంగా వస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఉగాది సందర్భంగా సాయిధరమ్ తేజ్ జీప్‌పై కూర్చున్న స్టిల్ విడుదల చేయగా.. నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజాగా విరూపాక్ష ఫస్ట్ సింగిల్ అప్డేట్ అందించారు.
ఫస్ట్ సింగిల్ నచ్చావులే నచ్చావులే లిరికల్ వీడియో సాంగ్‌ను మార్చి 24 (రేపు) లాంఛ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ అందమైన కొండల మధ్య చేనులో కూర్చున్న లుక్ సాంగ్ ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ.. క్యూరియాసిటీ పెంచుతోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతుంది విరూపాక్ష. ఇప్పటికే విడుదలైన విరూపాక్ష టైటిల్ గ్లింప్స్ వీడియో, టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. విరూపాక్షలో మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
కాంతార ఫేం అంజనీశ్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విరూపాక్షలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ మరోవైపు సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సీతమ్ తెలుగు రీమేక్‌లో వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటిస్తుండగా.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
Be all ears as Surya sings his heart out for his lady love Nandini 👩❤️👨
1st Single #NachavuleNachavule from #Virupaksha tomorrow ✅@IamSaiDharamTej @iamsamyuktha_ @karthikdandu86 @AJANEESHB @Shamdatdop @bkrsatish @NavinNooli @SVCCofficial @SukumarWritings#VirupakshaonApr21st pic.twitter.com/ShRjdHCEmL
— BA Raju’s Team (@baraju_SuperHit) March 23, 2023
Shaakuntalam | శాకుంతలం అప్డేట్.. మేలిమి బంగారంలా సమంత శకుంతల దేవి లుక్
Rangamarthanda | బ్రహ్మానందం నటనకు చిరంజీవి, రాంచరణ్ ప్రశంసలు
Kushi | ఆఫీస్‌కు వెళ్తూ సమంతకు బై చెప్తోన్న విజయ్ దేవరకొండ.. ఖుషి తాజా పోస్టర్
MarutiNagar Subramanyam | మారుతి నగర్లో ఫన్ షురూ.. రావు రమేశ్ ఎంట్రీ అదుర్స్