టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamshi) దర్శకత్వంలో వచ్చిన ఎమోషనల్ డ్రామా రంగమార్తాండ (Rangamarthanda). మరాఠీ సూపర్ హిట్ మూవీ నట సామ్రాట్‌కు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం (Brahmanandam), రమ్యకృష్ణ, అనసూయ భరద్వాజ్, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. దశాబ్దాలుగా సిల్వర్ స్క్రీన్‌పై కామెడీతో నవ్వించిన లెజెండరీ యాక్టర్ బ్రహ్మానందం ఈ సారి మాత్రం సీరియస్ పాత్రలో డిఫరెంట్ లుక్‌లో కనిపించాడు.
ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం మధ్య సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. బ్రహ్మానందం పోషించిన చక్రపాణి పాత్రపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తున్న బ్రహ్మానందంపై మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ ప్రశంసించారు. రంగమార్తాండ సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతున్న నేపథ్యంలో బ్రహ్మానందంకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. చిరంజీవి, రాంచరణ్ శాలువాతో సత్కరించారు.
లెజెండరీ కమెడియన్‌తో ఓవైపు మెగాస్టార్, మరోవైపు మెగా పవర్ స్టార్ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న స్టిల్ ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. బ్రహ్మానందంతో మరోవైపు చిరంజీవి సతీమణి సురేఖ, హైపర్ ఆది, వెన్నెల కిశోర్, శ్రీజ కలిసి దిగిన స్టిల్ కూడా ట్రెండింగ్ అవుతోంది. రాంచరణ్ నటిస్తోన్న ఆర్సీ 15 లొకేషన్లో ఈ స్టిల్స్ తీసినట్టు తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండగా.. రాంచరణ్ ఆర్సీ 15 చిత్రీకరణలో పాల్గొంటున్నాడు.
Megastar @KChiruTweets & Global Star @AlwaysRamCharan clicked, as they congratulate Dr. #Brahmanandam garu on his spectacular performance in the recent hit film 👏👏#RamCharan #Chiranjeevi #GlobalStarRamCharan #ManOfMassesRamCharan #ManOfMassesBdayMonth pic.twitter.com/jTyLuogosM
— BA Raju's Team (@baraju_SuperHit) March 23, 2023

Shaakuntalam | శాకుంతలం అప్డేట్.. మేలిమి బంగారంలా సమంత శకుంతల దేవి లుక్
Kushi | ఆఫీస్‌కు వెళ్తూ సమంతకు బై చెప్తోన్న విజయ్ దేవరకొండ.. ఖుషి తాజా పోస్టర్
MarutiNagar Subramanyam | మారుతి నగర్లో ఫన్ షురూ.. రావు రమేశ్ ఎంట్రీ అదుర్స్