Rao Ramesh | సిల్వర్ స్క్రీన్‌పై విలక్షణమైన విలనిజంతో అలరించిన దివంగత అలనాటి నటుడు రావు గోపాల్‌రావు లేని లోటును ఆయన నట వారసుడు రావు రమేశ్ (Rao Ramesh) భర్తీ చేస్తున్నాడు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాల్లో అలరించిన రావు రమేశ్ ఈ సారి హీరోగా కూడా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. రావు రమేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మారుతి నగర్ సుబ్రహ్మణ్యం (Maruti Nagar Subramanyam) అప్డేట్ వీడియో రూపంలో వచ్చేసింది.
మారుతి నగర్లో ఫన్ మొదలైంది.ఉగాది పచ్చడి, బెండకాయవేపుడుతోపాటు వినోదాత్మకంగా సాగే మారుతి సుబ్రహ్మణ్యం పాత్రతో ఈ ఉగాదిని జరుపుకోండి అంటూ ఓ వీడియోను మేకర్స్ షేర్ చేశారు. గళ్ల చొక్కా, లుంగీ గెటప్‌లో ఉన్న రావు రమేశ్ క్యారవాన్‌లో నుంచి షూటింగ్ లొకేషన్లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. డైరెక్టర్ యాక్షన్ అనగానే.. బెండకాయ వేపుడు లేదా డైలాగ్ చెప్తూ.. నవ్వు ఆపుకోలేకపోతున్నా డైరెక్టర్ అంటున్నాడు రావు రమేశ్.
మొత్తానికి చిన్న వీడియోతో సినిమా ఎలా ఉండబోతుందో చెబుతూ.. క్యూరియాసిటీని పెంచుతున్నాడు డైరెక్టర్. హ్యాపీ వెడ్డింగ్ ఫేం లక్ష్మణ్ కార్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అలనాటి అందాల తార ఇంద్రజ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. పీబీఆర్ సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ బ్యానర్లో వస్తున్న రెండో చిత్రమిది.
లొకేషన్లోకి రావు రమేశ్ ఎంట్రీ ఇలా..
🥁🥁🥁 *Fun starts in Maruthinagar..*
Team #Maruthinagarsubrahmanyam Wishes you all a #Happyugadi 🎉🎉.. Let us celebrate this #Ugadi with Ugadi pachadi and *#Bendakayavepudu* 😉😉😜 along with most entertaining character *#Maruthinagarsubrahmanyam* 😀😀#MNS pic.twitter.com/doqrYTmd5D
— BA Raju's Team (@baraju_SuperHit) March 23, 2023
Shaakuntalam | శాకుంతలం అప్డేట్.. మేలిమి బంగారంలా సమంత శకుంతల దేవి లుక్
Rangamarthanda | బ్రహ్మానందం నటనకు చిరంజీవి, రాంచరణ్ ప్రశంసలు
Kushi | ఆఫీస్‌కు వెళ్తూ సమంతకు బై చెప్తోన్న విజయ్ దేవరకొండ.. ఖుషి తాజా పోస్టర్