Sai dharam tej tweet | సాయి ధరమ్ తేజ్ ఎలా ఉన్నాడు.. కొన్ని రోజులుగా మెగా అభిమానులు తరచుగా అడుగుతున్న ప్రశ్న ఇది. దీనికి చాలా మంది బాగున్నాడనే చెప్తున్నారు. కానీ కొన్నిచోట్ల మాత్రం మనసు ఒప్పుకోలేని మాటలు చెప్పారు. ఇంకా ఆయన కోమాలోనే ఉన్నాడని.. స్పృహలో లేడని.. హాస్పిటల్లో చికిత్సకు కూడా స్పందించడం లేదని సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యంపై పుకార్లు బాగానే వచ్చాయి. అయితే అవన్నీ ఎవరూ నమ్మలేదు. ఎప్పుడైతే రిపబ్లిక్ సినిమా ఈవెంట్లో తన మేనల్లుడు ఇంకా కోమాలోనే ఉన్నాడని పవన్ ప్రకటించాడో.. అప్పట్నుంచే అభిమానులకు భయం మొదలైంది. అయితే ఇప్పుడు వాటిని కూడా తుంచేశాడు సాయి ధరమ్ తేజ్. హాస్పిటల్ నుంచే ఈయన ట్వీట్ చేశాడు. చాలా రోజుల తర్వాత సాయి కోలుకున్నాడు. ప్రస్తుతం ఈయన ఆరోగ్యం పూర్తిగా మెరుగు పడినట్లు తెలుస్తుంది. లేచి నిలబడటమే కాదు.. ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యుల నుంచి వస్తున్న సమాచారం.
Thanks is a small word to express my gratitude for your love and affection on me and my movie “Republic “
— Sai Dharam Tej (@IamSaiDharamTej) October 3, 2021
See you soon pic.twitter.com/0PvIyovZn3
తాజాగా ఆయన హాస్పిటల్లో లేచి కూర్చోవడమే కాకుండా.. థమ్స్ అప్ అంటూ ట్వీట్ చేశాడు. తనపై.. తన సినిమా రిపబ్లిక్‌పై మీరు చూపించిన ప్రేమకు థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట అని.. త్వరలోనే మీ ముందుకు వస్తానంటూ ట్వీట్ చేశాడు సాయి ధరమ్ తేజ్. ఇది చూసిన తర్వాత పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. తమ హీరో మళ్లీ కోలుకున్నాడని.. ఇక ఎవరినీ కూడా ఎలా ఉన్నాడని అడిగే అవసరమే లేదని సంతోషిస్తున్నారు. వారంలోనే సాయి ధరమ్ తేజ్‌ను డిశ్చార్జ్ చేస్తారంటూ ఆయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా చెప్పాడు. సెప్టెంబర్ 10న ఈయన బైక్ యాక్సిడెంట్‌కు గురయ్యాడు. కేబుల్ బ్రిడ్జి సమీపంలో రోడ్డుపై ఇసుక ఉండటంతో సాయి ధరమ్ తేజ్‌కి యాక్సిడెంట్ అయింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఈయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా సాయి ట్వీట్ తో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Vaishnav Tej: సాయి ధరమ్ తేజ్ హెల్త్ గురించి ఆయన సోదరుడు ఏం చెప్పాడంటే..!
ఒక్కసారి సాయి ధరమ్ తేజ్‌ను చూపించండి.. ఫ్యాన్స్ రిక్వెస్ట్
Republic: అనేక ఛాలెంజెస్ నడుమ 64 రోజుల్లో రిపబ్లిక్ షూటింగ్ పూర్తి- మేకింగ్ వీడియో
Republic | హీరో చచ్చిపోతే ఒప్పుకోరా.. రిపబ్లిక్ ఫలితం ఏం చెప్పింది..?
రిపబ్లిక్ మూవీ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన డైరెక్టర్