ఒక్కసారి సాయి ధరమ్ తేజ్‌ను చూపించండి.. ఫ్యాన్స్ రిక్వెస్ట్

Sai Dharam tej Health | మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌కు యాక్సిడెంట్ జరిగి 18 రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు ఆయన ఆరోగ్యంపై ఎవరికి తోచినట్లు వాళ్లు చెబుతున్నారు.. కానీ పర్ఫెక్ట్ సమాచారం మాత్రం ఇచ్చిన వారు లేరనే చెప్పాలి. వైద్యులు అయితే సాయి తేజ్ చాలా బాగున్నాడు.. త్వరగానే కోలుకుంటున్నాడని చెప్పారు. మరోవైపు కుటుంబ సభ్యులు కూడా ఇదే చెప్పారు. అయితే అసలు సమస్య పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత మొదలైంది. మొన్న రిపబ్లిక్ సినిమా ఈవెంట్లో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం గురించి సంచలన విషయాలు బయట పెట్టాడు పవన్ కళ్యాణ్. తన మేనల్లుడు ఇంకా కోమాలోనే ఉన్నాడని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. అయితే ఆయన తప్ప అక్కడ ఉన్న వాళ్లు అందరూ సాయి ధరమ్ తేజ్ చాలా బాగున్నాడని చెప్పారు. అందరి ఆశీస్సులతో త్వరలోనే మన ముందుకు వస్తాడు అని అందరూ చెప్తున్నారు.
ఇలాంటి సమయంలో రిపబ్లిక్ సినిమా దర్శకుడు దేవా కట్ట ఇచ్చిన ఇంటర్వ్యూ కొన్ని అనుమానాలకు తావిస్తోంది. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హాస్పిటల్ నుంచి సాయి ధరమ్ తేజ్ చూశాడని దేవా కట్టా చెప్పాడు. అంతేకాదు యాక్సిడెంట్ తర్వాత ఆయనను వెళ్లి కలిసి మాట్లాడి వచ్చానని.. సాయిని కలిసిన తర్వాతే అక్టోబరు 1న సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించామని దేవా కట్టా తన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక్కడే అభిమానులకు లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. అదే ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే కదా.. పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు కోమాలో ఉన్నాడు అని చెప్పింది.
మరి అదే వేడుకను సాయి తేజ్ ఎలా చూశాడు.. కోమాలో ఉన్న వ్యక్తి జరుగుతున్న వేడుకను లైవ్ లో చూశాడా.. ఇక్కడ ఎవరూ అబద్ధం చెబుతున్నారు అనేది అర్థం కావడం లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ అబద్ధం చెప్తే.. అంత అవసరం ఆయనకు ఏమొచ్చింది.. సొంత మేనల్లుడు విషయంలో అబద్దం అయితే పవన్ కళ్యాణ్ చెప్పరు కదా అని అందరూ అడుగుతున్నారు. మరోవైపు సాయి తేజ్‌ను కలిసి మాట్లాడి వచ్చానని దేవా కట్టా చెబుతున్నాడు. సుప్రీం హీరో ఆరోగ్యం విషయంలో ఇలా ఎవరికి తోచింది వాళ్లు మాట్లాడుతుంటే.. అభిమానులు కంగారు పడుతున్నారు. కుటుంబ సభ్యులు బయటకు వచ్చి అసలు విషయం చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Dil Raju | సినీ పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దు: దిల్ రాజు
ఆ ముద్దు సన్నివేశం గురించి సాయిపల్లవి ఏమన్నదంటే..?
‘మా’ రాజకీయ వేదిక కాదు.. ప్రకాశ్ రాజ్‌పై నరేశ్ ఫైర్
తగ్గేదే లే.. క్యూట్ లుక్స్‌తో కేక పెట్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

