Sai Dharam Tej Birthday Cebrations | సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్‌ను ఇండస్ట్రీలో చాలా మంది మంచి వాడు అంటుంటారు. తాజాగా ఆయన మరోసారి తన మంచితనాన్ని చూపించాడు. ఆదివారం నాడు సాయిధరమ్ తేజ్ తన 36వ బర్త్‌డేను జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే తేజ్ తన బర్త్‌డేను అనాధ పిల్లలతో జరుపుకున్నాడు. అనాధ పిల్లలను ఓ అడ్వేంచర్ పార్కుకు తీసుకెళ్లి రోజంతా వారితో సరదాగా గడిపాడు. అంతేకాకుండా చివర్లో వాళ్లతో కలిసి కేక్ కట్ చేశాడు. దీనిపై పలువురు సినీ ప్రముఖులు, ప్రేక్షకులు అభినందిస్తున్నారు. గతంలోనూ ఈయన చాలా సార్లు తన పుట్టిన రోజు వేడుకలను అనాధ పిల్లలతో కలిసి జరుపుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ‘SDT15’ చిత్రాన్ని చేస్తున్నాడు. కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్ పోస్టర్లు సినిమాపై ఆసక్తి క్రియేట్ చేశాయి. క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సాయిధరమ్ తేజ్‌కు జోడీగా సంయుక్త హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. ఇటీవలే ఈయన బర్త్‌డే రోజున రిలీజైన పోస్టర్‌కు విశేష స్పందన వచ్చింది.
Read Also:
Rc15 | శంకర్-రామ్‌చరణ్ మూవీలో సీనియర్ స్టార్ హీరోయిన్?
నిజ జీవిత సంఘటనల ఆధారంగా మహేష్-రాజమౌళి సినిమా తెరకెక్కనుందా.. వామ్మో ఇదేం ట్విస్ట్?
Karthi | మెగాఫోన్ పట్టనున్న కార్తి.. తొలి సినిమా ఆ స్టార్ హీరోతోనేనట..!
Allu Aravind | ఆ ఇద్దరు స్టార్ హీరోలతో అల్లు అరవింద్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడా..?