Gandhi Talks | తమిళం, తెలుగుతోపాటు పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న యాక్టర్లలో టాప్‌లో ఉంటారు కోలీవుడ్ హీరోలు విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి. ఈ ఇద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం‘గాంధీ టాక్స్’ (Gandhi Talks). మూకీ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రానికి కిషోర్ పి బేలేకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. జీ స్టూడియోస్ నిర్మ్తిస్తున్న ఈ చిత్రాన్ని గాంధీజీ వర్థంతి సందర్భంగా జనవరి 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ Saddha Saddha సాంగ్‌ను విడుదల చేశారు. బ్యాగు వేసుకుని పబ్‌కు వచ్చిన విజయ్ సేతుపతి, అక్కడే ఉన్నఅరవింద్ స్వామి అండ్ టీంపై వచ్చే డిఫరెంట్ స్టైల్లో సాగుతూ మూవీ లవర్స్‌కు నయా ఫీల్ అందించేలా ఉండబోతుందని విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి.
ఈ సినిమాలో మాటలు లేకపోయినా నటీనటుల ఎక్స్ప్రెషన్స్, మ్యూజిక్‌తోనే కథను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా రూపొందించబోతున్నట్టు తాజా సాంగ్ హింట్ ఇచ్చేస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ, మలయాళ భాషల్లో విడుదల చేయనుండగా.. టైటిల్ కార్డులు, ప్రమోషన్లతో గ్రాండ్‌గా రిలీజ్‌కు రెడీ అవుతోంది.ఈ మూవీలో అదితి రావు హైదరి, మరాఠీ నటుడు సిద్ధార్థ్ జాదవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్, మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. ఈ మూవీని ఉమేష్ కుమార్ బన్సల్, రాజేష్ కేజ్రీవాల్, మీరా చోప్రా, కిషోర్ పాండురంగ్ బేలేకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Salaar 2 | ప్రభాస్ సలార్ 2 టీజర్ వచ్చేస్తుంది.. ఇంతకీ ఏ తేదీనో తెలుసా..?
Actor Srikanth | ఉజ్జయిని మహాకాళేశ్వరుడి సన్నిధిలో నటుడు శ్రీకాంత్.. వీడియో వైరల్