సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. వివిధ రంగాల్లో తమదైన ముద్ర వేసిన ముగ్గురు సినీ ప్రముఖులు ఇవాళ ( మే 12న) మరణించారు. అందులో ఇద్దరు కరోనాతో మరణిస్తే.. ఒక్కరు గుండెపోటుతో చనిపోయారు. చిరంజీవి సినిమాతో పరిచయమైన సంగీత దర్శకుడు కేఎస్ చంద్రశేఖర్.. 2000 సినిమాలకు పైగా డబ్బింగ్ ఇంఛార్జ్ గా పని చేసిన కాంచన్ బాబు.. అంతరంగాలు లాంటి సీరియల్ డైరెక్ట్ చేసిన దాసరి నారాయణ రావు శిష్యుడు, దర్శకుడు అక్కినేని వినయ్ కుమార్ ఒకేరోజు మరణించారు. వీళ్ల మరణవార్తలతో తెలుగు చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.
సీనియర్ సంగీత దర్శకుడు కేఎస్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర 70 సినిమాలకు, రమేశ్ నాయుడు దగ్గర 40 సినిమాలకు పైగా పనిచేశాడు. చిరంజీవి హీరోగా నటించిన ‘యమకింకరుడు’ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు చంద్రశేఖర్. ఆ తర్వాత బ్రహ్మముడి, హంతకుడి వేట, ఆణిముత్యం, ఉదయం, అదిగో అల్లదిగో, బోళా శంకరుడు, ఆత్మ బంధువులు, కంచి కామాక్షి (తమిళ్, హిందీ) ఇలా దాదాపు 30కి పైగా చిత్రాలకు సంగీతం అందించారు. కీరవాణి, కోటి, మణిశర్మ లాంటి వాళ్లకు ఈయన గురువు. గుండెపోటుతో ఈయన కన్నుమూశారు.
డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ అధ్యక్షుడు వి. కాంచన్ బాబు కరోనాతో మృతి చెందారు. ఈయన అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా రాజశ్రీ, ఘంటసాల రత్నకుమార్ వద్ద 1000కి పైగా చిత్రాల్లో తన గొంతు అరువిచ్చారు. డబ్బింగ్ ఇన్‌ఛార్జ్‌గా దాదాపు 2000 వేలకు పైగా సినిమాలకు పని చేశారు. ప్రస్తుతం ఆయన డబ్బింగ్ యూనియన్ అధ్యక్ష పదవిలోనే ఉన్నారు.
ఏడంతస్తుల మేడ సినిమా నుంచి దాసరి నారాయణరావు దగ్గర శిష్యరికం చేసి పవిత్ర సినిమాతో దర్శకుడిగా మారిన అక్కినేని వినయ్ కుమార్ కరోనాతో చనిపోయారు. ఈయన వయసు 65 ఏళ్లు. సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ‘సుందరవదన సుబ్బలక్ష్మి మొగుడా’ సినిమాకు నిర్మాణ నిర్వహణ బాధ్యతలు కూడా నిర్వహించారు. సూపర్ హిట్ టీవీ సీరియల్ అంతరంగాలు, నా మొగుడు నాకే సొంతం, అమ్మ, ఆరాధన వంటి పలు సీరియల్స్ కి దర్శకత్వం వహించారు వినయ్ కుమార్. ఒకేరోజు ముగ్గురు ప్రముఖులు మరణించడంతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
రోజా కూతురు అన్షు మాలిక ఫొటోలు వైరల్
డబ్బు కోసం నన్ను దారుణంగా మోసం చేశారు : రేణు దేశాయ్
మీ అసాధారణ సహకారానికి సాటిలేదు : మహేశ్‌బాబు
ఎన్టీఆర్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన చిరంజీవి
చనిపోయినట్టు ప్రచారం.. ఖండించిన శక్తిమాన్ నటుడు
సమంత శీర్షాసనం.. వైరల్‌గా మారిన వీడియో
కరోనా నుండి కోలుకున్న అల్లు అర్జున్
ఓటీటీలో నితిన్ చిత్రం.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్
కరోనాతో నేషనల్ అవార్డ్ గ్రహీత కన్నుమూత