S thaman | టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పద్మ భూషణ్ (Padma Bhushan)కు ఎంపికైన నేపథ్యంలో ఆయన సోదరి నారా (నందమూరి) భుననేశ్వరి సెలబ్రేషన్స్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈవెంట్‌కు వచ్చిన పాపులర్ మ్యూజిక్ కంపోజర్ ఎస్ థమన్ సీఎం చంద్రబాబునాయుడుతో ఫొటో దిగాడు. థమన్ ఈ స్టిల్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. విజనరీ చీఫ్ మినిస్టర్ ఏపీ సీఎం చంద్రబాబును కలిసే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ట్వీట్ చేశాడు. ఈ ఫొటోకు సినీ, పొలిటికల్ సర్కిల్స్ నుంచి లైక్స్, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇప్పుడీ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
రిపబ్లిక్ డే సందర్భంగా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. సినీ రంగంలో చేసిన కృషికి గాను బాలయ్యను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుతో సత్కరించింది. బాలయ్యకు పద్మ పురస్కారం రావడంతో సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
With Our Honourable Visionary ⭐️💥
Chief Minister Of AndhraPradesh
Shri Nara ChandraBabu Naidu Gaaru @ncbn it Was Such Honour and A privilege to meet Him ❤️⭐️🥁#NCBN 💫🔥 gaaru 🥁💪🏾🦁 pic.twitter.com/sRWwo8T00H— thaman S (@MusicThaman) February 1, 2025
Game Changer | రాంచరణ్ అభిమానులకు ఎస్ థమన్ సారీ.. గేమ్ ఛేంజర్ గురించి ఏం చెప్పాడంటే..?
THE PARADISE | ఫిబ్రవరి.. జిమ్ సెషన్ స్టిల్‌తో నాని ఇచ్చిన హింట్ ఇదే