ఇటీవలే మీట్‌క్యూట్ సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటించింది అందాల భామ రుహానీ శర్మ (Ruhani Sharma). మీట్క్యూట్తో మంచి సక్సెస్ అందుకుంది. కాగా ఇపుడు రుహానీ శర్మ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్లో రాబోతున్న చిత్రంలో లీడ్ రోల్ చేస్తోంది. ఈ మూవీ టైటిల్ HER – Chapter 1. శ్రీధర్ రావు రైటర్ కమ్ డైరెక్టర్‌గా వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు. ఇందులో ఏసీపీ పాత్రలో కనిపించనుంది రుహానీ శర్మ.
ఈ చిత్రంలో సినిమా బండి ఫేం వికాస్ వశిష్ఠ లీడ్ యాక్టర్‌గా నటిస్తుండగా..జీవన్, రవి వర్మ, ప్రదీప్ రుద్ర, సంజయ్ స్వరూప్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డబుల్ అప్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లో రఘు సంకురత్రి, దీపికా సంకురత్రి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ బ్యానర్లో వస్తున్న తొలి సినిమా ఇదే. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పవన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. త్వరలో విడుదల తేదీపై క్లారిటీ రానుంది.
ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సినిమాపై అంచనాలు పెంచేస్తుంది రుహానీ శర్మ. ఇప్పటివరకు గ్లామరస్ పాత్రల్లో మెరిసిన రుహానీ శర్మ ఈ సారి మాత్రం రూట్ మార్చి సీరియస్ కథాంశంలో కనిపించబోతుంది. ఈ భామ ఆగ్రా సినిమాతో హిందీలో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది.
ఏసీపీ లుక్‌లో రుహానీ శర్మ..
The intense & intriguing first look of @iRuhaniSharma 's investigative thriller #HER is out now@sswaraghav @doubleupmediaa#DeepaSankuratri#RaghuSakuratri #Pavan #VishnuBesi #ChanakyaToorpu@PROSaiSatish#HERChapter1#HERFirstLook #HER pic.twitter.com/5Xf7AFzotC
— BA Raju's Team (@baraju_SuperHit) December 8, 2022
Read Also : Sivaji The Boss | తలైవా అభిమానులకు డబుల్ బొనాంజా.. మరో సినిమా రీరిలీజ్
Read Also : Satyadev | చిరంజీవి క్లాసిక్ రీమేక్‌లో నటించాలని ఉంది: సత్యదేవ్
Read Also : Tillu 2 | టిల్లు 2 హీరోయిన్గా మరో భామ పేరు.. ఈ సారైనా ఒకే అయ్యేనా..?
Vishnu Vishal | గుత్తా జ్వాల కష్టకాలంలో నా లైఫ్‌లోకి వచ్చింది: విష్ణువిశాల్