Satyadev | చిరంజీవి క్లాసిక్ రీమేక్‌లో నటించాలని ఉంది: సత్యదేవ్
సత్యదేవ్, తమన్నా (Tamannah), కావ్యశెట్టి, మేఘా ఆకాశ్ లీడ్ రోల్స్ లో నటిస్తున చిత్రం గుర్తుందా శీతాకాలం (Gurthunda Seetakalam). డిసెంబర్ 9న (రేపు) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ చేశాడు సత్యదేవ్.
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ (Satyadev), నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ గుర్తుందా శీతాకాలం (Gurthunda Seetakalam). తమన్నా (Tamannah), కావ్యశెట్టి, మేఘా ఆకాశ్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున ఈ చిత్రం డిసెంబర్ 9న (రేపు) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ చేశాడు సత్యదేవ్. గుర్తుందా శీతాకాలం మంచి సినిమా. కాలేజీ సీన్స్ ఉన్నాయని తెలుసుకొని.. ఈ వయసులో చేయలేకపోతే తర్వాత చేయలేం కాబట్టి ఈ సినిమా చేశానన్నాడు. మూడు షేడ్స్ లో సాగే ఈ సినిమాలో రొమాన్స్ తో పాటు కొత్తదనం కనిపిస్తుందని చెప్పాడు.
చిరంజీవి, మహేష్ బాబు, నయన తార, ఛార్మి, తమన్నా లాంటి సీనియర్లతో కలిసి పని చేస్తున్నపుడు నాకు తెలియని విషయాలు చాలా నేర్చుకున్నాను. వారి దగ్గర అంతా టైమ్ ప్రకారం జరిగిపోతుంది. టైమ్ వృధా కాదు..షూటింగ్ కూడా వేగంగా జరిగిపోతుందని చెప్పుకొచ్చాడు. మరోవైపు ట్విటర్లో అభిమానులు, ఫాలోవర్లతో సరదా చిట్ చాట్ సెషన్లో సత్యదేవ్‌ని డ్రీమ్ రోల్ గురించి అడిగారు ఓ నెటిజన్. చిరంజీవి కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిన క్లాసిక్ ‘చంటబ్బాయి’ రీమేక్‌లో నటించాలని ఉందని చెప్పుకొచ్చాడు.
కన్నడ సూపర్ హిట్ ప్రాజెక్ట్ లవ్ మాక్‌టెయిల్ చిత్రానికి తెలుగు రీమేక్‌గా వస్తుంది గుర్తుందా శీతాకాలం. నాగశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో సుహాసినీ మణిరత్నం కీలక పాత్రలో నటిస్తోంది. రొమాంటిక్ డ్రామా బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ చిత్రాన్ని నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్ మెంట్స్ శ్రీ వేదాక్షర మూవీస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

