Sivaji The Boss | తలైవా అభిమానులకు డబుల్ బొనాంజా.. మరో సినిమా రీరిలీజ్
రజినీకాంత్ 72వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా బాబా సినిమాను ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. అంతేకాదు తలైవా సినిమాల బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ కూడా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని టాక్. కాగా ఇపుడు మరో ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది.
డిసెంబర్ 12న తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajnikanth) పుట్టినరోజును ఘనంగా వేడుకగా జరుపుకునేందుకు అభిమానులు సిద్దమవుతున్నారు. రజినీకాంత్ 72వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా బాబా సినిమాను ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. అంతేకాదు తలైవా సినిమాల బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ కూడా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని టాక్. కాగా ఇపుడు మరో ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది.
సౌతిండియా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ శివాజీ (Sivaji)ని థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం తమిళం, హిందీ భాషల్లో డిసెంబర్ 9-15 మధ్య ఎంపిక చేయబడ్డ పీవీఆర్, సినీపొలీస్ చైన్స్ లో శివాజీ స్పెషల్ షోలుండబోతున్నాయి. ఈ విషయాన్ని ఏవీఎం ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది. పొలిటికల్ యాక్షన్ సినిమాగా వచ్చిన శివాజీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. శ్రియా శరణ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. సుమన్ విలన్‌గా నటించాడు.
ఏవీఎం ప్రొడక్షన్స్ నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వివేక్, మణివన్నన్, రఘువరణ్ కీలక పాత్రలు పోషించారు. శివాజి చిత్రంలో మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన పాటలు ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్స్ జాబితాలో ఉంటాయి.
Relive the magic of #SivajiTheBoss on the silver screen! Watch Superstar @rajinikanth's blockbuster, re-releasing in both Tamil & Hindi, in select PVR & Cinepolis Cinemas between the 9th-15th December!
For bookings check @_PVRCinemas & @IndiaCinepolis websites. #AVMProductions pic.twitter.com/zaK8NWVaeo
— AVM Productions | AVM Studios (@avmproductions) December 8, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

