Tillu 2 | టిల్లు 2 హీరోయిన్గా మరో భామ పేరు.. ఈ సారైనా ఒకే అయ్యేనా..?
టిల్లు 2 (Tillu 2)తో డబుల్ ఎంటర్టైన్ మెంట్ అందించడం కోసం ఫుల్ బిజీగా ఉన్నాడు సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda). అయితే టిల్లుతో కలిసి రొమాన్స్ చేయబోయే హీరోయిన్ ఎవరనే విషయంలో మాత్రం ముందునుంచీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
టాలీవుడ్ యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) టిల్లు 2 (Tillu 2)తో డబుల్ ఎంటర్టైన్ మెంట్ అందించడం కోసం ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. టిల్లు 2 చిత్రాన్ని నరుడా డోనరుడా ఫేం మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే టిల్లుతో కలిసి రొమాన్స్ చేయబోయే హీరోయిన్ ఎవరనే విషయంలో మాత్రం ముందునుంచీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
ఈ సినిమా హీరోయిన్ విషయంలో మొదట పెండ్లి సందD ఫేం శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది. శ్రీలీల తాను కొన్ని సన్నివేశాల్లో నటించలేనని చెప్పి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి.ఆ తర్వాత అనుపమ పరమేశ్వరన్ ఫైనల్ అయిందని, షూటింగ్ లో జాయిన్ అవ్వడమే తరువాయి అంటూ అప్డేట్ కూడా నెట్టింట హల్ చల్ చేసింది. అనంతరం అనుపమ కూడా తప్పుకోగా.. మడోన్నా సెబాస్టియన్ ఫీ మేల్ లీడ్ రోల్‌కు ఎంపికైందని ఇటీవలే మరో న్యూస్ ఫిలింనగర్లో చక్కర్లు కొట్టింది.
అయితే ఈ ముగ్గురూ కాకుండా హీరోయిన్గా ఇపుడు మరో భామ పేరు పరిశీలనలో ఉన్నట్టు వార్త హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా..? హిట్ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మీనాక్షి చౌదరి. మల్లిక్ రామ్ టీం మీనాక్షి (Meenakshi Chaudhary)అయితే టిల్లు2 రోల్‌కు సరిగ్గా సరిపోతుందని భావిస్తుండగా.. త్వరలోనే చర్చలు కూడా జరుపనున్నారని జోరుగా టాక్ నడుస్తోంది. అంతా అనుకున్నట్టు కుదిరితే టిల్లు2తో రొమాన్స్ చేయబోయే భామ మీనాక్షినే కానుంది.

తాజా అప్డేట్ కూడా గాసిప్లాగే మిగిలిపోతుందా..? లేదా..? చూడాలంటున్నారు సినీ జనాలు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ టిల్లు 2 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2023 మార్చిలో థియేటర్లలో సందడి చేయన్నాడు టిల్లు.
టిల్లు 2 ఫన్ ట్రాక్ వీడియో..
Read Also : Sivaji The Boss | తలైవా అభిమానులకు డబుల్ బొనాంజా.. మరో సినిమా రీరిలీజ్
Read Also : Satyadev | చిరంజీవి క్లాసిక్ రీమేక్‌లో నటించాలని ఉంది: సత్యదేవ్
Vishnu Vishal | గుత్తా జ్వాల కష్టకాలంలో నా లైఫ్‌లోకి వచ్చింది: విష్ణువిశాల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

