RRR Collections | బాలీవుడ్లో ‘ఆర్ఆర్ఆర్’ దండయాత్ర.. 200కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ
ప్రస్తుతం ఐపిఎల్‌కు మించిన హవా ఏదైనా ఉందంటే అది ‘ఆర్ఆర్ఆర్’ అనే చెప్పచ్చు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం సౌత్ నుంచి నార్త్ వరకు కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది.
RRR Collections | ప్రస్తుతం ఐపిఎల్‌కు మించిన హవా ఏదైనా ఉందంటే అది ‘ఆర్ఆర్ఆర్’ అనే చెప్పచ్చు. ఐపీఎల్‌ను హైలైట్స్లోనైనా చూసుకోవచ్చు.. కానీ ఆర్ఆర్ఆర్ను మాత్రం థియేటర్లో ఉన్నప్పుడే చూసేయాలి అని చాలా వరకు ప్రేక్షకులు భావిస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం సౌత్ నుంచి నార్త్ వరకు కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. చరణ్, తారక్‌ల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కలెక్షన్లను రాబడుతుంది. తాజాగా హిందీలో ఈ చిత్రం 200కోట్ల నెట్ కలెక్షన్లను సాధించి బాలీవుడ్ విశ్లేషకులను సైతం ఔరా అనిపించేలా చేస్తుంది.
‘ఆర్ఆర్ఆర్’ బృందం మొదటి నుంచే నార్త్‌లో గ్రాండ్‌గా ప్రమోషన్లను చేసింది. ఈ క్రమంలో హిందీలో ట్రిపుల్ఆర్కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. మొదటి రోజు నుంచి నార్త్‌లో కలెక్షన్ల విషయంలో ఏ మాత్రం జోరు తగ్గడంలేదు. 13వ రోజ కూడా ఈ చిత్రం రూ.5.50 కోట్ల కలెక్షన్లను సాధించింది. తాజాగా ఈ చిత్రం బాలీవుడ్లో 200కోట్ల మార్కును అందుకుంది. ఇప్పటివరకు హిందీలో ఈ చిత్రం రూ. 203.59 కోట్ల కలెక్షన్లను సాధించింది. టోటల్ వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రూ.952కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి 1000కోట్ల మార్కుకు రెండు అడుగుల దూరంలో ఉంది.
బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా, తారక్ కొమరం భీం పాత్రలో నటించాడు. ఆలీయాభట్, ఒలీవియా మొర్రీస్‌లు కథానాయికలుగా నటించారు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించాడు. దానయ్య డివివి ఈ చిత్రాన్ని 550 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ఇక ఇప్పటికే ఈ చిత్రాన్ని వీక్షించిన సినీప్రముఖులు సినిమా గొప్పతనంపై, సాంకేతిక బృందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
#RRR is second #Hindi film to hit DOUBLE CENTURY [post pandemic]… Absence of major film/s this weekend will boost its biz… [Week 2] Fri 13.50 cr, Sat 18 cr, Sun 20.50 cr, Mon 7 cr, Tue 6.50 cr, Wed 5.50 cr. Total: ₹ 203.59 cr. #India biz. pic.twitter.com/0jKek854Cr
— taran adarsh (@taran_adarsh) April 7, 2022
Read Also:
K.G.F Chapter-2 | నైజాంలో భారీ ధర పలికిన ‘కేజీఎఫ్-2’ థియేట్రికల్ హక్కులు
Ghani | భారీగా ‘గని’ బిజినెస్.. హిట్టు కోసం రాబట్టాల్సింది ఎంతంటే?
Gopichand | తమిళ దర్శకుడితో చర్చలు జరుపుతున్న గోపిచంద్?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

