Gopichand | తమిళ దర్శకుడితో చర్చలు జరుపుతున్న గోపిచంద్?
యాక్షన్ హీరో గోపిచంద్ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తున్నాడు. గతేడాది 'సీటీమార్' సినిమాతో గోపిచంద్ తిరిగి ట్రాక్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం ఈయన నటించిన 'పక్కాకమర్షియల్' షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది.
Gopichand | యాక్షన్ హీరో గోపిచంద్ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తున్నాడు. గతేడాది ‘సీటీమార్’ సినిమాతో గోపిచంద్ తిరిగి ట్రాక్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘పక్కాకమర్షియల్’ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. మారుతి దర్శకత్వంలో వహించిన ఈ చిత్రంలో రాశిఖన్నా హీరోయిన్గా నటించింది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ గ్లింప్స్ ప్రేక్షకులలో భారీ అంచనాలు నమోదయ్యాయి. బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం జూన్ 1న విడుదల కానున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.
గోపిచంద్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాలు బ్లాక్ బాస్టర్ విజయాలను సాధించాయి. ఈ సారి ఎలాగైనా హ్యట్రిక్ సాధించాలని ఈ దర్శక హీరోలు కసిగా ఉన్నారట. ఈ చిత్రం సెట్స్ పైన ఉండగానే గోపిచంద్ మరో కథను ఓకే చెయ్యడానికి సిద్ధంమైనట్లు టాలీవుడ్ వర్గాల్లో సమాచారం. ‘సింగం’ సిరీస్‌ను తెరకెక్కించిన తమిళ దర్శకుడు హరి గోపిచంద్‌తో ఓ భారీ యాక్షన్ సినిమాను చేయాలని భావిస్తున్నాడట. దానికోసం గోపిచంద్‌ను హరి సంప్రదించారట. ప్రస్తుతం ఈ కథపై చర్చలు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Read Also:
Ghani | భారీగా ‘గని’ బిజినెస్.. హిట్టు కోసం రాబట్టాల్సింది ఎంతంటే?
Telugu movies | ఈ వారం థియేటర్/ఓటీటీలో సందడి చేయబోయే తెలుగు సినిమాలు ఇవే!
RamaRao On Duty | ‘రామారావు ఆన్ డ్యూటీ’ నుంచి బిగ్ అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- gopichandh
- hari
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

