RamaRao On Duty | ‘రామారావు ఆన్ డ్యూటీ’ నుంచి బిగ్ అప్డేట్
'ఖిలాడీ'తో భారీ ఫ్లాప్‌ను అందుకున్న మాస్రాజ ఈ సారి 'రామారావు ఆన్ డ్యూటీ'తో ఎలాగైనా మంచి హిట్టు సాధించాలని కసితో ఉన్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్న ఈ చిత్రం నుంచి మేకర్స్ తాజాగా ఓ బిగ్ అప్డేట్ను ప్రకటించారు.
RamaRao On Duty | మాస్రాజ రవితేజ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ తీరిక లేకుండా షూటింగ్లలో పాల్గొంటున్నాడు. ఏడాదికి రెండు సినిమాలను విడుదల చేసే విధంగా రవితేజ ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. గతనెల ‘ఖిలాడీ’తో భారీ ఫ్లాప్‌ను అందుకున్న మాస్రాజ ఈ సారి ‘రామారావు ఆన్ డ్యూటీ’తో ఎలాగైనా మంచి హిట్టు సాధించాలని కసితో ఉన్నాడు. శరత్ మండవ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇటీవలే స్పెయిన్‌లో రెండు పాటలను చిత్రీకరించి సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్న ఈ చిత్రం నుంచి మేకర్స్ తాజాగా ఓ బిగ్ అప్డేట్ను ప్రకటించారు.
ఈ చిత్రంలోని ఫస్ట్సింగిల్కు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను గురువారం సాయంత్రం 4.05 గంటలకు ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో రవితేజకు జోడిగా రజిషా విజయన్, దివ్యాంశ కౌషిక్‌లు నటించారు. చాలా కాలం తర్వాత సీనియర్ హీరో వేణు తోట్టెంపూడి ఈ చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. శ్రీ లక్ష్మివెంకటేశ్వరా సినిమాస్, ఆర్టి టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరితో కలిసి రవితేజ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా కనిపించబోతున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూన్ 17న ప్రేక్షకుల ముందుకు తీసకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
The wait is over!#RamaRaoOnDuty First Single announcement today at 4:05 PM ❤️ 🎶#RamaRaoOnDutyOnJune17 @RaviTeja_offl @directorsarat @itsdivyanshak @rajisha_vijayan @SamCSmusic @Cinemainmygenes @sathyaDP @sahisuresh @shobimaster @SLVCinemasOffl pic.twitter.com/GxetJQzhDh
— RT Team Works (@RTTeamWorks) April 7, 2022
Read Also:
Telugu movies | ఈ వారం థియేటర్/ఓటీటీలో సందడి చేయబోయే తెలుగు సినిమాలు ఇవే!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

