K.G.F Chapter-2 | నైజాంలో భారీ ధర పలికిన ‘కేజీఎఫ్-2’ థియేట్రికల్ హక్కులు
కన్నడ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం 'కేజీఎఫ్'. అప్పటివరకు కన్నడ సినిమాలను ఇతర ఇండస్ట్రీ వాళ్ళు అంతగా పట్టించుకునే వారు కాదు. ఆ సమయంలో కేజీఎఫ్ చిత్రం ప్రభంజనం సృష్టించింది. ఎలాంటి అంచనాల్లేకుం
K.G.F Chapter-2 | కన్నడ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం ‘కేజీఎఫ్’. అప్పటివరకు కన్నడ సినిమాలను ఇతర ఇండస్ట్రీ వాళ్ళు అంతగా పట్టించుకునే వారు కాదు. ఆ సమయంలో కేజీఎఫ్ చిత్రం ప్రభంజనం సృష్టించింది. ఎలాంటి అంచనాల్లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన ప్రతి ఏరియాలో వసూళ్ళ సునామీని సృష్టించింది. ‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయిలో ‘కేజీఎఫ్’ చిత్రం బాలీవుడ్లో జెండా పాతింది. అప్పటివరకు ఇండియన్ సినిమాలో అలాంటి ఎలివేషన్లు ఎక్కడా చూడలేదు. ప్రశాంత్ నీల్ టేకింగ్‌కు, విజన్‌కు సినీప్రముఖులు సైతం అశ్చర్యంలో పడ్డారు. అప్పటివరకు అసలు మొహం కూడా తెలియని యష్ ఈ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఈ చిత్రంలో యష్ నటన, డైలాగ్ డెలివరీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
‘కేజీఎఫ్’ సీక్వెల్ కోసం కన్నడతో పాటు ప్రతి సినీ ప్రేక్షకుడు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిన ‘కేజీఎఫ్ చాప్టర్-2’ ఏప్రిల్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రతి ఏరియాలో ఈ చిత్ర బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతుంది.ఈ క్రమంలోనే ఈ చిత్ర నైజాం హక్కులు 50కోట్లకు అమ్యుడయ్యాయట. ఒక డబ్బింగ్ చిత్రానికి ఈ స్థాయిలో బిజినెస్ జరగడమనేది విశేషం అనే చెప్పాలి. కేజిఎఫ్ చాప్టర్-1 రూ.5 కోట్ల బ్రేక్ఈవెన్‌తో వచ్చి రూ.12.30 కోట్ల కలెక్షన్లను సాధించి డబుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.హోంబలే సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఇప్పటికే చాప్టర్-2 నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ రికార్డు స్థాయిలో వ్యూస్‌ను సాధించాయి. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన ఎదగరా ఎదగరా సాంగ్‌కు విశేష స్పందన వచ్చింది.
Read Also:
Gopichand | తమిళ దర్శకుడితో చర్చలు జరుపుతున్న గోపిచంద్?
Ghani | భారీగా ‘గని’ బిజినెస్.. హిట్టు కోసం రాబట్టాల్సింది ఎంతంటే?
Telugu movies | ఈ వారం థియేటర్/ఓటీటీలో సందడి చేయబోయే తెలుగు సినిమాలు ఇవే!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

