
టాలీవుడ్ లో రాంచరణ్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్ లో వస్తోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్ ( RRR movie). పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీకి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకుడు. ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ ( Ram Chran ) కనిపించనుండగా..కొమ్రం భీంగా ఎన్టీఆర్ ( NTR ) తనలోని డిఫరెంట్ యాంగిల్ ను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఓ పాటను ఉక్రెయిన్ లో షూట్ చేస్తోంది జక్కన్న టీం.
ఇదిలా ఉంటే ఈ పాటతో షూటింగ్ పూర్తవుతుండటంతో జక్కన్న ప్రమోషన్స్ ను మొదలుపెట్టబోతున్నాడు. ఇంతకీ ప్రమోషన్స్ ఈవెంట్స్ ను లీడ్ చేసే బాధ్యత రాజమౌళి ఎవరికి అప్పగించాడో తెలుసా..? కొమ్రం భీమ్ కు ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టబోతున్నాడు. సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ టీం అధికారిక ఖాతాలో రేపటి (ఆగస్టు 9) నుండి రాబోయే కొన్ని రోజులు ఇన్ స్టాగ్రామ్ ను భీంతోపాటు ఆర్ఆర్ఆర్ స్వాధీనం చేసుకుంటోంది. ఉక్రెయిన్‌లో భీం ఏమి చేస్తున్నాడో చూడటానికి వేచి ఉండండి అంటూ ఎన్టీఆర్ స్టిల్ షేర్ చేసింది.
ఈ భారీ ప్రాజెక్టులో బాలీవుడ్ నటి అలియాభట్ సీత పాత్ర పోషిస్తోంది. హాలీవుడ్ భామ ఒలివియా మొర్రీస్ ఎన్టీఆర్ కు జోడీగా నటిస్తోంది. శ్రియా శరణ్, అజయ్ దేవ్ గన్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. రాజమౌళి అండ్ టీం ఉక్రెయిన్ లోని ఐకానిక్ ప్యాలెస్ లో ఈ పాటను చిత్రీకరిస్తోంది. ఈ సాంగ్ సిల్వర్ స్క్రీన్ పై ఆడియెన్స్ కు విజువల్ ఫీస్ట్‌గా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇవి కూడా చదవండి..
Dhyan chand : త్వరలో ధ్యాన్ చంద్ బయోపిక్
శృతి హాసన్ కోసం ప్రభాస్ ఎన్ని రకాల వంటలు చేయించాడో చూడండి..!
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?