భారీ అంచనాల మధ్య విడుదలైన ఆర్ఆర్ఆర్ (RRR)..వాటికి ఏ మాత్రం తగ్గకుండా తన స్టామినా ఏంటో చూపిస్తూ సక్సెస్ ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతోంది. దేశీయ మార్కెట్లోనే కాకుండా ఓవర్సీస్లో కలెక్షన్ల విషయంలో తన మేనియా కొనసాగిస్తోంది. యూఎస్‌లో మార్చి 24న హాలీవుడ్ బిగ్ ప్రాజెక్టులు (Hollywood Movies) ది లాస్ట్ సిటీ, ది బ్యాట్ మ్యాన్ కలెక్షన్లను అధిగమించినట్టు బీటౌన్ సర్కిల్ టాక్. ఆర్ఆర్ఆర్ మార్చి 25న ఆస్ట్రేలియన్ బాక్సాపీస్ (Australian Box Office) వద్ద ది బ్యాట్‌మాన్ కలెక్షన్లను కూడా అధిగమించిందని సమాచారం.
తాజా ఫీట్స్ తో ఆయా దేశాల్లో ఆర్ఆర్ఆర్ బాక్సాపీస్ ఫిగర్స్ విషయంలో పైన తెలిపిన తేదీల నుంచి నంబర్ 1 స్థానంలో ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇదివరకెన్నడూ లేని విధంగా ఓ భారతీయ సినిమా ఇలా నంబర్ 1గా నిలవడం ఓ అఛీవ్ మెంట్‌గా ట్రేడ్ పండితులు అభివర్ణిస్తున్నారు. మొత్తానికి ఆర్ఆర్ఆర్ హాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టేసి ఇండియన్ సినిమా పవరేంటో చూపించడం గర్వించదగ్గ విషయమని భావిస్తున్నారు సినీ జనాలు.
ఆర్ఆర్ఆర్లో రాంచరణ్ (Ram Charan) అల్లూరి సీతారామరాజు (Alluri Seetarama Raju)గా కనిపించగా, ఎన్టీఆర్ (Jr NTR) కొమ్రంభీం పాత్రలో నటించాడు. ఈ ఇద్దరు తమ తమ పాత్రల్లో జీవించేసి అభిమానుల నీరాజనాలు అందుకుంటున్నారు. డైరెక్టర్ రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.