శ్రీకాంత్ తనయుడు రోషన్ ప్రస్తుతం ‘ఛాంపియన్’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాను ప్రియాంక దత్, జీకే మోహన్, జెమినీ కిరణ్ కలిసి నిర్మిస్తున్నారు. 70శాతం ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అలాగే.. మోహన్‌లాల్ మలయాళ చిత్రం ‘వృషభ’లో కూడా రోషన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ఇదిలావుంటే, ఇప్పడీ యంగ్ హీరో, విజయవంతమైన ‘హిట్ సిరీస్’ సినిమాలతో ప్రేక్షకులకు చేరువైన శైలేష్ కొలను దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్టు వినికిడి.