బాలీవుడ్ (Bollywood)టాప్ దర్శకనిర్మాతలైన కరణ్‌జోహార్ (Karan Johar) ,రోహిత్‌శెట్టి (Rohit Shetty), టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun)పై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ టాప్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్లు బన్నీని పొడగడటమేంటని అనుకుంటున్నారా..? అవును మీరు విన్నది. ఇంతకీ కారణమేంటనే కదా మీ డౌటు. కరోనా మహమ్మారి ప్రభావంతో కుదేలైన తెలుగు సినీ పరిశ్రమ ఇప్పటికే కొంత గాడిలో పడ్డ సంగతి తెలిసిందే. అయితే కోవిడ్ దెబ్బతో బాలీవుడ్ మాత్రం (Hindi cinema) ఇంకా ట్రాక్‌పైకి రాలేదు.
అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశి (Sooryavanshi) దివాళి కానుకగా గ్రాండ్‌గా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ సినిమాతో హిందీ చిత్రాలను చూసేందుకు జనాలు మళ్లీ థియేటర్లకు వస్తారన్న ఆశతో ఉన్నారు దర్శకనిర్మాతలు. ఇదే విషయాన్ని వరుడు కావలెను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రస్తావించాడు అల్లు అర్జున్. ప్రేక్షకులు సూర్యవంశి చిత్రాన్ని ఆదరించాలని, ఇలాంటి సినిమాలు మళ్లీ థియేటర్లలో సందడి చేయాలని కోరుకున్నాడు బన్నీ.
An absolute superstar through and through, thank you @alluarjun for your love!!❤️ https://t.co/Ef1hzhf3LN
— Karan Johar (@karanjohar) October 28, 2021
తమ సినిమాతోపాటు హిందీ చిత్ర పరిశ్రమ మళ్లీ మెరుగుపడాలని అల్లు అర్జున్ కోరుకోవడం, ఇదే విషయాన్ని ఈవెంట్లో ప్రస్తావించడంతో చాలా సంతోషంగా ఫీలయ్యారు కరణ్, రోహిత్. అంతేకాదు అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప చిత్రం కూడా బాక్సాపీస్ వద్ద మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు రోహిత్‌శెట్టి, కరణ్ జోహార్. సంపూర్ణ సూపర్ స్టార్..మీ ప్రేమ కోసకు ధన్యవాదాలు అంటూ కరణ్ జోహార్ ట్వీట్ చేశాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Aryan Khan bail | టాప్ లాయర్‌తో ఈ సారైనా ఆర్యన్‌కు బెయిల్ వచ్చేనా..?
RRR huge Update | అక్టోబర్ 29న రెడీగా ఉండండి..ఆర్ఆర్ఆర్ టీం ట్వీట్
Samantha art | సమంత పెయింటింగ్ ఆర్ట్ వీడియో వైరల్
RX100 Remake Trailer | ఆర్ఎక్స్ 100 రీమేక్ ట్రైలర్ అదిరింది..వీడియో