Ritika Nayak | విశ్వక్సేన్ నటించిన అశోకవనంలో అర్జుణ కళ్యాణం సినిమాలో సెకండ్ హీరోయిన్గా మెరిసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది ఢిల్లీ సుందరి రితికా నాయక్ (Ritika Nayak). బ్యాక్ టు బ్యా సినిమాలలో లైన్లో పెట్టిన ఈ భామ పుట్టినరోజు జరుపుకుంటుండగా.. మూవీ లవర్స్, ఇండస్ట్రీ కోస్టార్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రితికా నాయక్ నటిస్తోన్న సినిమాల్లో ఒకటి మిరాయి ( Mirai).
పాన్ ఇండియా అడ్వెంచరస్ మూవీగా వస్తోన్న ఈ చిత్రంలో తేజసజ్జా (Teja Sajja) హీరోగా నటిస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. బర్త్ డే విషెస్ చెబుతూ రితికా నాయక్ లుక్ విడుదల చేశారు. ఇందులో విభ పాత్రలో కనిపించబోతున్నట్టు ఫస్ట్ లుక్‌తో అర్థమవుతోంది. డైరెక్టర్ ఈ అడ్వెంచరస్ రైడ్ ప్రాజెక్ట్‌లో రితికానాయక్ను ఎలాంటి పాత్రలో చూపించబోతున్నాడన్నది సస్పెన్స్‌గా మారింది.
మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన మిరాయి టైటిల్ గ్లింప్స్ వీడియోకు మంచి స్పందన వస్తోంది. మరోవైపు తేజ సజ్జా ఎత్తైన భవంతిపై నుంచి ఓ ఐరన్ రాడ్‌ను పట్టుకుని తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తున్న మిరాయి పోస్టర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఈ చిత్రంలో మంచు మనోజ్ (Manchu Manoj) నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుండగా.. ఇప్పటికే మంచు మనోజ్ మిరాయి లుక్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. గౌరా హరి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2025 ఏప్రిల్ 18న 2డీ, 3డీ వెర్షన్లలో ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Team #MIRAI wishes their fierce and fabulous VIBHA aka the super talented @RitikaNayak_ a very Happy Birthday❤️🔥#HBDRitikaNayak ✨ pic.twitter.com/v3bH2gQQH6
— BA Raju’s Team (@baraju_SuperHit) October 27, 2024
Vijay | నటుడు విజయ్ తొలి సభకు భారీ జన సందోహం
Lucky Baskhar | ప్రతీ అభిమాని కాలర్ ఎగరేస్తారు.. దుల్కర్ సల్మాన్ లక్కీభాస్కర్పై వెంకీ అట్లూరి
Zebra | సత్యదేవ్ జీబ్రా దీపావళికి రావడం లేదు.. ఎందుకో మరి..?