Renu Desai | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఏపీ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మరో 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక పవన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో మెగా కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ (Renu Desai) సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ఇద్దరు పిల్లలు ఆద్య (Aadya), అకీరా (Akira) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ దుస్తుల్లో తమ తండ్రి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. వారిద్దరితో రేణూ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన క్యూట్ ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ..‘నా క్యూట్ పిల్లలు వాళ్ల నాన్న బిగ్గెస్ట్ డేకి ఇలా రెడీ అయ్యారు. ఏపీ రాష్ట్రానికి, ప్రజలకు మంచి చేయాలనుకుంటున్న పవన్ కల్యాణ్ గారికి శుభాకాంక్షలు’ అని పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
Also Read..
Pawan Kalyan | చిరంజీవి పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్న మంత్రి పవన్ కళ్యాణ్
Pawan kalyan | కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను ఏపీ మంత్రిగా..