Pawan Kalyan | జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. పవన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ప్రాంగణంలోని వారంతా లేచి చప్పట్లతో అభినందించారు. అయితే ఈ ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని మోదీ, గవర్నర్తో పాటు సీఎం చంద్రబాబుకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. ఆ తరువాత చిరంజీవి పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇక ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్షా, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ప్రముఖ నటులు చిరంజీవి, రజినీకాంత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఎల్జేపీ చీఫ్, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్, మాజీ గవర్నర్ తమిళిసై, తదితరులు హాజరయ్యారు.
His love and respect for Annayya is special ❤️
Mega Brothers @KChiruTweets @PawanKalyan ❤️
Pakkana Thalaivar @rajinikanth undatam, inka special!!pic.twitter.com/HWzLB0T3jP— గుడుంబా శంకర్ (@GudumbaCares007) June 12, 2024