Renu Desai | రేణూ దేశాయ్ టాలీవుడ్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కొన్ని రోజుల పాటు డేటింగ్లో ఉండి ఆ తర్వాత అతన్ని వివాహం చేసుకుంది. వారు ఇద్దరు పిల్లల్ని కూడా కన్నారు. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కలిసి మొదట `బద్రి` సినిమాలో నటించారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాతోనే సౌత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసి గుడ్ బై చెప్పింది. పవన్ ని వివాహం చేసుకున్న తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు. ఇక విడాకుల తర్వాత పిల్లలని చూసుకుంటూ ఆ బాధ్యతలతోనే బిజీ అయింది. ఖాళీ ఉన్నప్పుడు కొన్ని సినిమాలని డైరెక్ట్ చేసింది.
ఇటీవల రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో కనిపించి అలరించింది. ఈ మూవీ హిట్ అయి ఉంటే రేణూ తిరిగి సినిమాలు చేసేదేమో. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో మళ్లీ సినిమాల ఊసెత్తడం లేదు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణూ ఎప్పుడు కూడా సమాజంపై చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంటుంది. సమాజంలో కొందరు చేసే తప్పు పనులు తన దృష్టికి వస్తే వెంటనే నిలదీసి కడిగి పడేస్తుంది. అయితే ఇటీవల కశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తదనంతర పరిణామాలు అందరికీ తెలిసినవే. పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రస్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మన బలగాలు దాడి చేయడం.. తర్వాత ఇండియా-పాకిస్థాన్ మధ్య మూడు రోజుల పాటు యుద్ధ వాతావరణం నెలకొనడం మనం చూశాం. అయితే ఈ మొత్తం ఘటనపై కొందరు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెడుతున్నారు.
పాకిస్థాన్‌కి చైనా, టర్కీ లాంటి దేశాలు మద్దతు పలకడం భారత్‌తో పాటు పలు దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అంతేకాకుండా టర్కీకి వెళ్లే చాలా మంది భారతీయులు తమ ప్రయాణాలు కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇలాంటి వేళ నటి రేణూ దేశాయ్ అందరికీ ఓ సలహా ఇచ్చారు. దేశం పట్ల బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలంటూ కోరారు. నేను ఇప్పటి వరకు చైనాలో తయారు చేసిన చాలా వస్తువులని కొనుగోలు చేశారు. ఇక నుండి ప్రతి లేబుల్ చెక్ చేసి చైనా వస్తువుని నిషేదిస్తాను. ఇది చాలా పెద్ద పనే అయిన కూడా ఎక్కడో ఒక చోట మొదలు కావాలి. మనం కొనే ప్రతి వస్తువు ఎక్కడ తయారవుతుందో లేబుల్‌ని కచ్చితంగా చదివి ఆ తర్వాత తీసుకోండి. మన దేశానికి మద్దతు పలకండి.. జై హింద్ అంటూ రేణూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.