Renu Desai | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య సినీ నటి రేణూ దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన అనంతరం తనకంటూ మల్టీ టాలెంటెడ్ పర్సన్ సేవా ధృక్పథం ఉన్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకుంది.
అయితే పవన్‌తో విడిపోయిన కొన్ని రోజులకు తాను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎంగేజ్మెంట్ కూడా గ్రాండ్‌గా చేసుకుంది. అయితే కారణం ఎంటో తెలిదు. సడన్‌గా ఎంగేజ్మెంట్ తర్వాత ఆ పెళ్లిని రద్దు చేసుకొని ప్రస్తుతం తన పిల్లలతో గడుపుతుంది. అప్పుడప్పుడు తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాను రెండో పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.
నా చిన్నప్పుడు తన తల్లిదండ్రులు నేను అమ్మాయిగా పుట్టాను అని చాలా బాధపడ్డారు. తండ్రి అయితే నన్ను తాకేందుకు కూడా ఇష్టపడలేదని తెలిపింది. అప్పట్లో ఆడపిల్ల పుడితే చంపేసేవారు అయితే నా పేరెంట్స్ చదువుకున్నవారు కావడంతో నన్ను అలా చేయలేదు. పేరెంట్స్ ఉండి కూడా వారి ప్రేమను నేను దక్కించుకోలేకపోయాను. అయితే విడాకుల ప్రకటించిన అనంతరం నా పేరెంట్స్ నన్ను దగ్గరికి కూడా తీసుకోలేదు. అది నన్ను చాలా బాధపెట్టింది. నాలాగే నా పిల్లల జీవితం నాశనం కాకూడదని.. అందుకే రెండో వివాహానికి ఎంగేజ్మెంట్ చేసుకున్న కూడా తర్వాత క్యాన్సిల్ చేసుకున్నట్లు వెల్లడించింది.
ఇక విడాకుల అనంతరం 17 ఏండ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్.. తాజాగా రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao) అనే సినిమాలో కీలక పాత్ర పోషించింది.
Also Read..
The Greatest of all time | ఇండియాలో కూడా.. విజయ్ అభిమానులకు ది గోట్ మేకర్స్ శుభవార్త
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు భారీగా వరద.. పర్యాటకులతో సందడిగా మారిన ఘాట్‌రోడ్లు..!
Squid Game S2 | ఓటీటీలోకి కొరియన్ పాపులర్ వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్ సీజన్ 2’