Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు భారీగా వరద.. పర్యాటకులతో సందడిగా మారిన ఘాట్‌రోడ్లు..!
Srisailam Dam | ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద భారీగా పెరుగుతున్నది. గంట గంటకు వరద ఉధృతి మరింత పెరుగుతూ వస్తున్నది. ప్రస్తుతం ప్రాజెక్టు పది గేట్లను 15 అడుగుల వరకు ఎత్తి 3,76,670 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు.
Srisailam Dam | శ్రీశైలం : ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద భారీగా పెరుగుతున్నది. గంట గంటకు వరద ఉధృతి మరింత పెరుగుతూ వస్తున్నది. ప్రస్తుతం ప్రాజెక్టు పది గేట్లను 15 అడుగుల వరకు ఎత్తి 3,76,670 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. దాంతో వరద నాగార్జున సాగర్ వైపు వెళ్తున్నది. జూరాలా, సుంకేశుల జలాశయాల నుంచి డ్యామ్‌కు ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం 3,95,162 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. అవుట్ ఫ్లో 4,36,902 క్యూసెక్కులుగా నమోదైంది.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.40 అడుగులుగా ఉన్నది. జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215.807 టీఎంసీలు.. ప్రస్తుతం జలాశయంలో 212.4385 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. కుడి, ఎడమగట్టులోని జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతున్నది. మరో వైపు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో శ్రీశైలం పరిసరాలన్నీ పర్యాటకులతో కిక్కిరిసిపోతున్నాయి. డ్యామ్ అందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. దాంతో ఘాట్ రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి.
Read Also :
-
Nagarjuna Sagar | నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న భారీ వరద
-
Telangana Assembly | నల్లబ్యాడ్జీలతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

