The Greatest of all time | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay) రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. వీటిలో ఒకటి వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్ట్ చేస్తు్న్న ది గోట్ (The Greatest Of All Time). దళపతి 68 (Thalapathy 68)గా వస్తోన్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా ఐమ్యాక్స్ వెర్షన్లో కూడా రిలీజ్ కానుందని ప్రకటించారు మేకర్స్.
అయితే విజయ్ అభిమానుల కోసం ఇండియాలో కూడా ఐమ్యాక్స్ వెర్షన్ విడుదల కాబోతుందని నటుడు అరుణ్ విజయ్ ట్వీట్ చేశాడు. తాజా వార్తతో విజయ్ సినిమాను ఐమ్యాక్స్ వెర్షన్లో కూడా చూడొచ్చని తెగ సంబరాలు చేసుకుంటున్నారు ఫ్యాన్స్, మూవీ లవర్స్. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ మూవీలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం, అరవింద్ ఆకాశ్, ప్రేమ్ గీ అమరేన్, వైభవ్, మనోబాల, వీటీవీ గణేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ది గోట్ చిత్రంలో విజయ్ ఓ వైపు ఓల్డ్ మ్యాన్‌గా, మరోవైపు యంగ్ లుక్‌లో కనిపిస్తున్న లుక్‌తో రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. పాపులర్ యూకే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అహింసా ఎంటర్టైన్మెంట్స్ ఇప్పటికే యూకేలో అడ్వాన్స్ బుకింగ్స్ షురూ చేయగా.. సేల్స్‌కు అద్బుతమైన స్పందన వస్తోంది.
Good Morning Guys 🔥♥️#TheGreatestOfAllTime Is Planning For an IMAX Release in India Too , Official Announcement awaiting !! #Goat3rdSingle pic.twitter.com/B8Qxjj1wpG
— Arun Vijay (@AVinthehousee) August 1, 2024
Thangalaan | తుఫాను వచ్చేస్తుంది.. విక్రమ్ తంగలాన్ అడ్వెంచరస్ రైడ్‌కు రెడీనా..?
NBK 109 | షూటింగ్ స్పాట్లో బాబీ.. బాలకృష్ణ ఎన్బీకే 109 డైరెక్టర్‌కు బర్త్ డే విషెస్
Buddy | ఇంతకీ అల్లు శిరీష్ బడ్డీలో టెడ్డీబేర్ పాత్రలో నటించిందెవరో తెలుసా..?