Squid Game S2 | ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’. ఇది ఎంత పెద్ద హిట్ అయిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలోని సగం కంటే ఎక్కువ ప్రేక్షకులు ఈ వెబ్ సిరీస్‌ను చూశారు. 2021 నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన ఈ వెబ్ సిరీస్ చాలా పెద్ద హిట్టయింది. రిలీజ్ అయిన కేవలం 28 రోజుల్లో ఈ సిరీస్‌ను ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల మంది నెట్‌ఫ్లిక్స్ యూజర్లు చూశారు. సిరీస్‌లో వయొలెన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ ప్రేక్షకులకు బాగానే చేరువైంది. కాగా.. ప్రస్తుతం స్క్విడ్ గేమ్ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తుండగా.. సీజన్‌తో పాటు ఫైనల్ సీజన్‌కు సంబంధించిన తేదీని ప్రకటించింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ ఏడాది డిసెంబర్ 26 నుంచి సీజన్ 2 ప్రసారం కానున్నట్లు మేకర్స్ రివీల్ చేశారు. అలాగే ఈ సిరీస్ ఫైనల్ సీజన్‌ను వచ్చే ఏడాది రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ సంస్థ తాజాగా ఓ వీడియో ద్వారా ప్రకటించింది.
The real game begins. Squid Game Season 2 is coming December 26.
The Final Season coming 2025. pic.twitter.com/Y3fQJ7LA2h
— Netflix (@netflix) July 31, 2024
ఇక మొదటి సీజన్లో కనిపించిన లీ జంగ్ జే, లీ బ్యుంగ్ హున్, వి హా జున్, గాంగ్ యూ… రెండో సీజన్లో కూడా నటించనున్నారు. వీరితో పాటు యిం సి వాన్, కాంగ్ హా న్యూల్, పార్క్ సంగ్ హూన్, యాంగ్ డాంగ్ గ్యూన్ స్క్విడ్ గేమ్ నటుల్లో కొత్తగా చేరారు. ఇదిలా ఉండగా.. స్క్విడ్ గేమ్ సీజన్ 1 నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు సృష్టించింది. కేవలం 28 రోజుల్లోనే 1.65 బిలియన్ గంటల వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంది. అంతేకాదు పలు అవార్డులను కూడా స్క్విడ్ గేమ్ సాధించింది. ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డుల్లో 14 నామినేషన్లను పొంది.. ఆరు అవార్డులను గెలుచుకుంది.
Also Read..
BRS | మహిళా ఎమ్మెల్యేలపై సీఎం వ్యాఖ్యలు.. నిరసనలతో హోరెత్తిన తెలంగాణDelhi Rain |
ఢిల్లీలో 24 గంటల్లో 108 మి.మీటర్ల వర్షం.. 1961 తర్వాత ఇదే తొలిసారిDonald Trump: ఆమె
భారతీయురాలా? లేక నల్లజాతీయురాలా?.. కమలా హ్యారిస్ మూలాలపై డోనాల్డ్ ట్రంప్