Delhi Rain | భారీ వర్షానికి దేశ రాజధాని ఢిల్లీ (Delhi Rain) నగరం చిగురుటాకులా వణికిపోయింది. బుధవారం సాయంత్రం మొదలైన వాన గురువారం ఉదయం వరకూ ఏకధాటిగా కురిసింది. ఈ కుంభవృష్టికి రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ప్రధాన రహదారుల్లోకి మోకాళ్ల లోతు మేర నీరు చేరింది. వాహనాలు నీట మునిగాయి. అనేక ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరింది.
దీంతో రాజధానిలో జనజీవనం స్తంభించిపోయింది. 24 గంటల్లో ఢిల్లీలో 108 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇది 14 ఏళ్లలో జులై నెలలో ఒకే రోజు (highest in a single day) ఈ స్థాయిలో వర్షం కురవడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. చివరి సారిగా 1961 జులై 2న 24 గంటల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.
ఇక సఫ్దర్జంగ్లో బుధవారం సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 8 : 30 గంటల మధ్య 79.2 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. మయూర్ విహార్లో 119 మి.మీ, పూసాలో 66.5 మిమీ, ఢిల్లీ యూనివర్శిటీ ప్రాంతంలో 77.5 మి.మీ, పాలెమ్ అబ్జర్వేటరీలో 43.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ నివేదించింది.
Also Read..
Heavy Rain | ఢిల్లీలో కుండపోత.. గంట వ్యవధిలో 11.25 సెంటీమీటర్ల వాన