Parliament | ‘బయట పేపర్ లీకులు, లోపల వాటర్ లీకులు’.. పార్లమెంట్ లాబీలో నీటి లీకేజీపై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు
Parliament | దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం (Delhi Rain) ముంచెత్తింది. ఈ వర్షానికి పార్లమెంట్ లాబీ (Parliament lobby)లో వాటర్ లీక్ అయ్యింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ (Manickam Tagore) ఎక్స్ వేదికగా షేర్ చేసి.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Parliament | దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం (Delhi Rain) ముంచెత్తింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకూ ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షానికి పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పలు చోట్ల ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి. ఇక ఈ వర్షానికి పార్లమెంట్ లాబీ (Parliament lobby)లో వాటర్ లీక్ అయ్యింది.
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కేంద్రం ఇటీవలే కొత్తగా పార్లమెంట్ భవనాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. గత ఏడాదే దీన్ని ప్రారంభించారు. అప్పుడే రూఫ్ నుంచి వర్షం నీరు లీకవుతుండటంతో విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పార్లమెంట్ లాబీలో వాటర్ లీక్ అవుతున్న దృశ్యాలను కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ (Manickam Tagore) ఎక్స్ వేదికగా షేర్ చేసి.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
బయట పేపర్ లీకులు, లోపల వాటర్ లీకులు జరుగుతున్నాయని వ్యంగ్యంగా రాసుకొచ్చారు. ఇటీవల రాష్ట్రపతి ఉపయోగించిన పార్లమెంట్ లాబీలో వర్షపు నీరు లీకవ్వడం.. అత్యవసర వాతావరణ స్థితిస్థాపకత సమస్యల్ని ఎత్తి చూపుతోందన్నారు. ఈ అంశంపై లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
కాగా.. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ నూతన భవనాన్ని గతేడాది మే 28న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తలిసింది. ఆ తర్వాత గతేడాది సెప్టెంబర్ 19న ఈ భవనంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను కూడా నిర్వహించారు. ఇక కొత్త భవనం ప్రారంభించిన ఏడాదికే లీకేజీలు బయటపడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Paper leakage outside,
water leakage inside. The recent water leakage in the Parliament lobby used by the President highlights urgent weather resilience issues in the new building, just a year after completion.
Moving Adjournment motion on this issue in Loksabha. #Parliament pic.twitter.com/kNFJ9Ld21d— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) August 1, 2024
Also Read..
Iran | హనియా హత్యకు ప్రతీకారం.. ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడికి ఆదేశాలిచ్చిన ఇరాన్ సుప్రీం లీడర్
Harassing Woman | వరద నీటిలో బైక్‌పై వెళ్తున్న మహిళపై పోకిరీల దురుసు ప్రవర్తన.. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jajula Srinivas Goud | బీసీ కులగణనపై అమిత్ షా స్పందించాలి.. దేశవ్యాప్త ఉద్యమం ఆపేది లేదు: జాజుల
Books Launch | తెలుగు సాహితీ వికాస వేదిక ఆధ్వర్యంలో ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ
Gold in Rapido | ర్యాపిడోలో బంగారం పంపిస్తే.. ఆభరణాలతో ఉడాయించిన డ్రైవర్!
‘విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో సైన్స్ కాంగ్రెస్ దోహదం’
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

