Iran | హనియా హత్యకు ప్రతీకారం.. ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడికి ఆదేశాలిచ్చిన ఇరాన్ సుప్రీం లీడర్
Iran | ఇరాన్ సుప్రీమ్ లీడర్ (Iran Supreme Leader) అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) తమ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. హనియా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడి చేయాలని ఖమేనీ ఆదేశించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
Iran | హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియా (Ismail Haniyeh) హత్య నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రికత్తలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తున్నది. హనియాను ఇజ్రాయెలే (Israel) హత్య చేసిందని ఇరాన్, హమాస్ భావిస్తున్నాయి. హమాస్ అధినేత ఇరాన్లో చనిపోవడంతో ఈ అంశాన్ని ఇరాన్ సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు ఇరాన్ సుప్రీమ్ లీడర్ (Iran Supreme Leader) అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) తమ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.
హనియా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడి చేయాలని ఖమేనీ ఆదేశించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. హనియా మృతి తర్వాత బుధవారం ఇరాన్ భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. ఆ సమావేశంలోనే ఇజ్రాయెల్‌పై దాడి చేయాలని ఖమేనీ ఆదేశాలు ఇచ్చారని ది న్యూయార్క్ టైమ్ నివేదించింది. కీలక అధికారుల సమాచారాన్ని ఊటంకిస్తూ.. కథనం ప్రచురించింది.
హమాస్ చీఫ్ హనియా హతం
హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్లో హత్యకు గురయ్యాడు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఆయన నివాసంపై బుధవారం తెల్లవారక ముందు 2 గంటల సమయంలో జరిగిన వైమానిక దాడిలో హనియా మరణించాడని ఇరాన్ ప్రభుత్వంతోపాటు హమాస్ గ్రూపు కూడా ధ్రువీకరించింది. దాడిలో హనియాతోపాటు ఆయన బాడీగార్డు కూడా మరణించాడని తెలిపాయి. ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారానికి హాజరై, ఇంటికి వచ్చిన తర్వాత ఈ దాడి జరిగినట్టుగా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. లెబనాన్ రాజధాని బీరుట్లో ఇరాన్ మద్దతు గల హెజ్బొల్లా టాప్ కమాండర్‌ను హతమార్చినట్టు ఇజ్రాయెల్ మంగళవారం సాయంత్రం ప్రకటించగా.. దానికి కొద్ది గంటల తర్వాతనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
ఇక ఇజ్రాయెలే హనియాను హత్య చేసిందని ఇరాన్, హమాస్ ఆరోపించాయి. అయితే హనియా హత్యపై స్పందించేందుకు ఇజ్రాయెల్ నిరాకరించింది. ఇక ఈ హత్యలో తమ ప్రమేయం లేదని అమెరికా పేర్కొన్నది. మరోవైపు ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. హనియా ప్రతీకారాన్ని తమ డ్యూటీగా తీసుకొంటామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ కఠిన శిక్షకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడికి ఆదేశించినట్లుగా తెలుస్తోంది.
Also Read..
Building Washed Away | హిమాచల్‌లో క్లౌడ్ బరస్ట్.. సిమ్లాలో నదిలో కొట్టుకుపోయిన భారీ భవనం.. వీడియో
Harassing Woman | వరద నీటిలో బైక్‌పై వెళ్తున్న మహిళపై పోకిరీల దురుసు ప్రవర్తన.. వీడియో
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

