గురువారం 03 డిసెంబర్ 2020
Cinema - Oct 20, 2020 , 09:00:29

రంగు నీళ్ళు పోసి నామినేట్ చేసిన ఇంటి స‌భ్యులు

రంగు నీళ్ళు పోసి నామినేట్ చేసిన ఇంటి స‌భ్యులు

బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ స‌క్సెస్ ఫుల్‌గా ఆరు వారాలు పూర్తి చేసుకొని ఏడో వారంలోకి అడుగుపెట్టింది. సోమ‌వారం రోజు ఎలిమినేషన్ ప్ర‌క్రియ ఉండ‌నుండ‌గా, దీనికి సంబంధించి ఇంటి స‌భ్యులు ముందుగానే స్కెచ్‌లు వేసుకున్నారు. కాని ఈ సారి వారి ఆలోచ‌న‌ల‌కు విర‌ద్ధంగా కొత్త ఫిటింగ్ పెట్టాడు. రాజ‌శేఖ‌ర్ మాస్ట‌ర్ అర్ధ శిరోముండ‌నం చేయించుకున్న కార‌ణంగా ఈ వారం నామినేష‌న్‌లో ఉండ‌రు, ఇక ఇప్పుడు కెప్టెన్‌గా ఉన్న‌ నోయ‌ల్ గ‌త వారం డీల్‌‌లో భాగంగా త‌నంత‌న తానే నామినేష‌న్‌లో ఉండేందుకు సిద్ధ‌మ‌య్యాడు. 

ఇక మిగిలిన ప‌ది మంది ఇంటి స‌భ్యుల‌లో జ‌త‌లుగా విడ‌దీసి, వారిరివురు చ‌ర్చించుకొని ఎవ‌రు నామినేష‌న్‌లోకి వెళ‌తారో బిగ్ బాస్‌కు చెప్పాల‌ని అన్నారు. అంతేకాదు నామినేష‌న్ అయిన వ్య‌క్తిపై సేవ్ అయిన వ్య‌క్తి రంగు నీళ్ళు పోయాల్సి ఉంటుంద‌ని అన్నారు. ప‌ది ఇంటి స‌భ్యుల‌ను బిగ్ బాస్ 5 జ‌త‌లుగా విడ‌దీయ‌గా వారిలో  అఖిల్-మోనాల్ ఓ జంట‌,  హారిక-అభిజిత్,  సొహైల్-అవినాష్,  దివి-లాస్య, మెహబూబ్-అరియానా లు జంట‌లుగా స్టాండ్స్ ద‌గ్గ‌ర‌కు వెళ్ళి నిలుచొని ఉన్నారు. 

నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో ముందు అఖిల్- మోనాల్ జంట ఎవ‌రు నామినేష‌న్‌లోకి వెళ్ళాలి, ఎవ‌రు సేవ్ కావాల‌నే విష‌యంపై చ‌ర్చించారు. అన్ని విష‌యాల‌లో నీ క‌న్నా నేను ఎక్కువ ప‌ర్‌ఫార్మెన్స్  చేశాను అని అఖిల్ చెప్ప‌డంతో మోనాల్ నామినేష‌న్‌లో వెళ్లింది. దీంతో అఖిల్ ఆమెపై బ‌కెట్‌లో ఉన్న రంగు నీళ్ళు పోసాడు. 

ఇక రెండో జంట సోహైల్- అవినాష్‌లు కొంత సేపు చ‌ర్చించారు. సోహైల్ తాను సంచాల‌కుడిగా ఉన్న స‌మ‌యంలో అవినాష్ నోరు జార‌డం గురించి చ‌ర్చించారు. నేను అందులో రాసిన విధంగానే ఉన్నాను కాని నువ్వు అన‌వ‌స‌రంగా అర‌వ‌డం నాకు న‌చ్చ‌లేదు. అదీకాక నేనుచాలా సార్లు నామినేట్ అయ్యాను, నువ్వు ఇంత వ‌ర‌కు కాలేదు కాబ‌ట్టి ఈ సారి నామినేష‌న్‌లోకి వెళ్ళాల‌ని  అవినాష్‌‌ని కోరాడు. అయితే సోహైల్ చెప్పిన కార‌ణాలు అవినాష్ యాక్సెప్ట్ చేయ‌క‌పోవ‌డంతో ఇద్ద‌రు నామినేష‌న్‌లోకి వెళ్లేందుకు ఆస‌క్తి చూప‌లేదు. 

బిగ్ బాస్ వారిద్ద‌రిని హెచ్చ‌రిస్తూ మీ ఇద్ద‌రిలో ఒక్క‌రు త‌ప్ప‌నిస‌రిగా నామినేట్ కావ‌ల్సిందే అనే స‌రికి అవినాష్‌.. మేం ఎలాంటి ప‌రిస్తితుల‌లో ఇక్క‌డకు వ‌చ్చామో మీకు తెలుసు. చిన్న కార‌ణాల‌కు నామినేట్ చేయాల‌ని చెప్ప‌డం స‌రికాదు. అన్నీ వ‌దుల‌కొని వ‌చ్చాం. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో నామినేట్ చేయాల‌ని అంటున్నారు. అదీ కరెక్ట్ కాదు. సేఫ్ గేమ్ ఆడుతున్నా అని అన్నారు. అరిచాన‌ని నామినేష‌న్ కావాలంటున్నారు. స‌రే నేనే నామినేట్ చేసుకుంటున్నానని అవినాష్ చెప్పారు.  అయితే అవినాష్ త‌న‌కోసం చేసిన త్యాగానికి అత‌నిని సేవ్ చేయాల‌ని సోహైల్ త‌న అభిమానుల‌ని కోరాడు.

ఇక హౌజ్‌లో మ‌రో రొమాంటిక్ పెయిర్ అభిజిత్- హారిక‌ల మ‌ధ్య నామినేష‌న్ విష‌యంలో చాలా సేపు చ‌ర్చ జరిగింది. నేను ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు నామినేషన్స్ జరిగితే అందులో ఐదు నామినేషన్స్‌లో ఉన్నా.. ప్రతిసారీ సేవ్ చేస్తూ వస్తున్నారు. ఈసారి కూడా నామినేట్ అయితే సేవ్ చేస్తారని అనుకోలేను.. సో నువ్ నామినేట్ అయితే బాగుంటుంది అని హారికతో చెప్పాడు అభిజిత్. దీనికి హారిక ఇప్పుడు డిస్క‌స్ చేసే స‌మ‌యం కాదు. అభిజిత్ నిన్ను బ్లేమ్ చేయడం లేదు.. బిగ్ బాస్‌ని బ్లేమ్ చేస్తున్నా.. ఇద్దరిలో ఎవరు నామినేట్ అయినా అన్ ఫెయిర్.. నేను సేవ్ అయినా హ్యాపీగా ఉండలేను.. నీకు నేను నామినేట్ కావడం ఇష్టం లేదు. నాకు నువ్వు నామినేట్ కావ‌డం ఇష్టం లేదు అని చెప్పుకొచ్చింది. అయితే అభిజిత్ తానే నామినేట్ అవుతాన‌ని చెప్ప‌డంతో . నా నోటితో నేను నామినేషన్‌కి నీ పేరు చెప్పలేను అభి అని హారిక అన‌డంతో తను నామినేట్ అవుతున్న విష‌యాన్ని బిగ్ బాస్ కు చెప్పాడు అభిజిత్. దీంతో హారిక ఏడుస్తూ అభిపై రంగనీళ్ల బకెట్‌ను వదిలింది.

దివి- లాస్య టైం వ‌చ్చే స‌రికి లాస్య త‌న వ‌ర్షెన్‌ను చెప్పుకొచ్చింది. ఈ సారి త‌న అభిమానుల‌కు కొంత రెస్ట్ ఇవ్వాల‌ని అనుకుంటున్నా అని లాస్య పేర్కొంది. ఇక దివి నేనంటే నీకు పడటంలేదని, ఇప్పటి నుంచైనా నాపై ఉన్న బ్యాడ్‌ ఒపీనియన్‌ మార్చుకోవాలని ఆశిస్తూ నామినేషన్‌కి వెళ్తున్నా అని చెప్పింది. దీంతో లాస్య .. దివిపై రంగు నీళ్ళు పోసింది.